గ్యాస్ లీక్ ;;పరిశ్రమల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి :అఖిలపక్షం వినతి.




 

కాకినాడ : విశాఖ ఎల్జీ గ్యాస్ లీక్ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో పరిశ్రమల స్థితిగతులపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు చేపట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాజకీయ అఖిలపక్షం సూచించింది.                                                                                                             తెలుగుదేశం, సీపీఐ,  జనసేన, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు శుక్రవారం ఈ మేరకు డిఆర్వో సిహెచ్ సత్తిబాబు కు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఘటన బాధాకరమని, మృతి చెందిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సుదీర్ఘ లాక్ డౌన్ అనంతరం ఇచ్చిన సడలింపులతో చాలా ప్రదేశాల్లోపరిశ్రమలు తిరిగి ప్రారంభమవుతున్నాయని, ఈక్రమంలో ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం అన్నారు. మానవ తప్పిదమైనా, సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా పలువురు ప్రాణాలు కోల్పోయారని ఈ సంఘటన పై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే జిల్లాలో సముద్రతీర ప్రాంతంలో అనేక పరిశ్రమలు నెలకొని ఉన్నాయని, వీటిని పర్యావరణ, పరిశ్రమలశాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరమే పునఃప్రారంభం చేసేందుకు    అనుమతులు ఇవ్వాలని కోరారు.కార్యక్రమంలో తెదేపా కాకినాడ సిటి  మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు,       జనసేన పిసిసి సభ్యులు పంతం నానాజీ,  సీపీఐ జిల్లా  సెక్రటరీ తాటిపాక మధు, కాంగ్రెస్ నుండి నులుకుర్తి వెంకటేశ్వరరావు,ఆకుల వెంకట ఆర్.పి ఐ .పిట్ట వరప్రసాద్, రామణ తదితరులు పాల్గొన్నారు.


 

 



 

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు