ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు అన్ని రకాల షాపులు తెరవచ్చు;;

సడలింపులతో కూడిన పొడిగింపు మే 17 వరకు లాక్ డౌన్ ఉంటుందన్నారు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ... దానిలో భాగంగా రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్ లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన ప్రాథమిక నియమాలు, షరతులు పాటిస్తూ జిల్లా ప్రజల ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు.  మన జిల్లా ఆరెంజ్ జోన్ లో ఉందన్నారు. రేపటి నుండి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు అన్ని రకాల షాపులు తెరిచి ఉంటాయి అన్నారు. అయితే జిల్లాలో  విద్యారంగానికి, మతపరమైన సమావేశాలు, సినిమా, షాపింగ్ మాల్స్, పార్కులుకు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలకు అనుమతి లేదన్నారు.  రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికి వీలు లేదన్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. జిల్లలో 12  కంటైన్మెంట్ జోన్ లు  ఉన్నాయని,  కేసులు ఉన్న ప్రాంతాలలో ప్రత్యేకమైన షరతులు ఉంటాయన్నారు. 21 మే లోగా కొత్త కేసులు నమోదు కాకపోతే జిల్లా గ్రీన్ జోన్ పరిదిలోకి వస్తుందన్నారు. జిల్లాలో ప్రైవేట్ సంస్థలలో 33 శాతం సిబ్బందితో అనుమతులు ఇవ్వబడుతుంది అన్నారు                                                                                                                                 ఈనెల 21వ తేదీలోగా కొత్త కేసులు నమోదు కాకపోతే జిల్లా  గ్రీన్ జోన్ పరిధిలోకి వస్తుందని జిల్లా కోవిడ్ -19 ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే తెలిపారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయం వివేకానంద మీటింగ్ హాల్ నందు జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే మాట్లాడుతూ జిల్లాలో సడలింపులతో కూడిన పొడిగింపు మే 17 వరకు లాక్ డౌన్ ఉంటుందన్నారు. దానిలో భాగంగా రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్ లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన ప్రాథమిక నియమాలు, షరతులు పాటిస్తూ జిల్లా ప్రజల ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు.  మన జిల్లా ఆరెంజ్ జోన్ లో ఉందన్నారు. రేపటి నుండి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు అన్ని రకాల షాపులు తెరిచి ఉంటాయి అన్నారు. అయితే జిల్లాలో  విద్యారంగానికి, మతపరమైన సమావేశాలు, సినిమా, షాపింగ్ మాల్స్, పార్కులుకు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలకు అనుమతి లేదన్నారు.  రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికి వీలు లేదన్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. జిల్లలో 12  కంటైన్మెంట్ జోన్ లు  ఉన్నాయని,  కేసులు ఉన్న ప్రాంతాలలో ప్రత్యేకమైన షరతులు ఉంటాయన్నారు. 21 మే లోగా కొత్త కేసులు నమోదు కాకపోతే జిల్లా గ్రీన్ జోన్ పరిదిలోకి వస్తుందన్నారు. జిల్లాలో ప్రైవేట్ సంస్థలలో 33 శాతం సిబ్బందితో అనుమతులు ఇవ్వబడుతుంది అన్నారు. జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 12,372 శాంపిల్స్ కలెక్టర్ చేయగాఅందులో 45 పోజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండడం వలన ఇది సాధ్య పడిందన్నారు. జిల్లాలో ఆరు కోవిడ్  హాస్పిటల్స్ ఉన్నాయని, రాజమహేంద్రవరం జిఎస్ఎల్ ఆసుపత్రిని జిల్లా కోవిడ్ హాస్పిటల్ గా ప్రకటించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రతి రోజు 600 లనుండి 1000 శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుందన్నారు. రేపటినుండి అన్ని ప్రభుత్వ , ప్రైవేటు ఆసుపత్రులలో ఓపి ప్రారంభించడం జరుగుతుందన్నారు. వైరస్ లక్షణాలు కనిపించిన ఎడల వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. వైయస్సార్ టెలీ మెడిసిన్ కు సంబంధించి  టోల్ ఫ్రీ నెం. 14410 ను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. మద్యం అమ్మకాలకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుండి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదన్నారు. ప్రజలు షాపు దగ్గరకు వెళ్లేటప్పుడు భౌతిక దూరం తోపాటు  మాస్కులు, శానిటైజర్లు ఖచ్చితంగా వినియోగించాలన్నారు. బయట రాష్ట్రాల నుండి మన జిల్లా కి రావాలన్నా, మన జిల్లాలో ఉన్న ఇతర ప్రాంతాల వారు వారి ప్రాంతాలకు వెళ్ళేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1902 ఫోన్ చేసి ముందుగా వారి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలో 2768 మంది వివిధ జిల్లాలకు చెందిన వారు మన జిల్లాలో ఉన్నారన్నారు. ఇతర ప్రాంతాల నుండి జిల్లాకు వచ్చే వారికి వైద్య పరీక్షలు చేయించడం జరుగుతుందన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల సహకారం లేకుండా ప్రభుత్వ అధికారులు ఎంత కష్టపడిన ఉపయోగం ఉండదన్నారు. ఈ 45 రోజులు జిల్లా ప్రజల సహకారం ఎంతైనా ఉందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఆరోగ్య సేతు యాప్ ను ప్రతి ఒక్కరు తమ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ రెడ్ జోన్ ప్రాంతాల్లో అన్ని షరతులతో పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 71,374 కేసులు నమోదు చేయగా రూ.3కోట్ల 57లక్షల,323 ఫైన్ రూపంలో వసూలు చేయడం జరిగిందన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమం ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జి లక్ష్మీ శ, జేసి-2 జి.రాజకుమారి, డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, ఇతర ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు