కాకినాడ ;;అత్యవసర సరుకుల విక్రయ దుకాణాలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చు
కాకినాడ ;;కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కె రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేసిన covid-19 ఇన్స్టంట్ ఆర్డర్ 48 అనుసరించి నగరపాలక సంస్థ పరిధిలో గల వ్యాపార సంస్థలు అన్నీ కూడా వారి షాపులను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరిచి ఉండవలెనని ఆదేశాలు జారీ చేసియున్నారు. అత్యవసర సరుకుల విక్రయ దుకాణాలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం
7 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని తెలియజేయుచున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో కాయగూరల దుకాణములు మరియు నిత్యవసర దుకాణములు వారు మాత్రమే ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంచాలని తెలియజేయడమైనది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి