ఆక్వా రైతులను ఆదుకున్నది మీరే

తూర్పుగోదావరి ;;రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపద్యంలో ఏడాదిలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పధకాల పై మన పాలన - మీ సూచన పేరుతో నిర్వహిస్తున్న మేధో మధన సదస్సు రెండో రోజు మంగళవారం జరిగింది. దీనిలో వ్యవసాయం అనుబంధ రంగాల పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా మంత్రులతో, కలక్టర్లతో సైంటిస్టులు, రైతులతో ముఖాముఖిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన ఆక్వా రైతు గంగాధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు అధికారంలోనికి వచ్చిన వెంటనే ఆక్వా రైతులను ఆదుకున్నారని తెలిపారు. ఆక్వా రైతుల కరెంట్ విషయంలో గత ప్రభుత్వంలో కరెంటు బిల్లులు ఎక్కువగా వచ్చేవని ఒక్కొక్క సారి బిల్లును కట్టలేని పరిస్థితుల్లో కరెంట్ ను కూడా నిలుపుదల చేసేవారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తమరు ముఖ్యమంత్రిగా ఆక్వా రైతులకు యూనిట్ కు రూ. 1-50 పైసలు నిర్ణయించి ఎంతగానో మేలు చేసారని గంగాధర్ తెలియజేసారు. కోవిడ్-19 పరిస్థితుల్లో ఆక్వా రైతులు రూ.50 నుండి రూ. 60 లు వరకు రోడ్ల మీద తమ ఉత్పత్తులను అమ్ముకొనే పరిస్థితుల్లో ఆక్వా రైతుల కష్టాన్ని గుర్తించి మద్దత ధర నిర్ణయించడం ద్వారా మాకు ఎంతో మేలు చేసారని తెలిపారు. నా కుమార్తె నూజివీడు ఐఐటిలో చివర సంవత్సరం బిటక్ చదువుతున్నదని చదువు నిమిత్తం తన భార్య ఖాతాలో రూ. 15వేలు రీయింబర్స్ మెంట్ సొమ్మును వేసింనందుకు నా కుమార్తె చదువుకు ఆర్థిక సమస్యలు లేకుండా వున్నామని ఆక్వా రైతు తెలిపారు. తమరు పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలను నేరవేర్చడంలో మీరు నూటి నూరు శాతం అమలు చేస్తున్నరని ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని ఆయన తెలిపారు. సియం క్యాంపు కార్యాలయం నుండి జిల్లా ఇన్- చార్జి మంత్రి మాపిదేవి వెంకటరమణ, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు, వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. జిల్లా కలక్టర్ కార్యాలయంలోని వివేకానంద హాలు నుండి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి, జాయింట్ కలక్టర్ ( ఆర్) జి.లక్ష్మీశ, జెడి అగ్రికల్చర్ ప్రసాద్, జిల్లా అధి కారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు