3 వ తేదీ లాక్ డౌన్ ;; సడలింపు ఇస్తే తగు జాగ్రత్తలు

తూ . గో ;;మే 3వ తేదీన లాక్ డౌన్ పై సడలింపులు ఇస్తే జిల్లాలో తగిన విధంగా జన జీవనానికి ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తున్నట్లు కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కలక్టర్ తన కార్యాలయం నుండి కోవిడ్ - 19 ప్రత్యేక అధికారి కాంతిలాల్ ధాండే, జెసి లక్ష్మీశతో కలిసి క్షేత్రస్థాయి వైద్య ఆరోగ్య శాఖ, ఎమ్.పి.డిఓలు, తాహసిల్దార్లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ కోవిడ్ - 19 లాక్ డౌన్ లో భాగంగా ఈ వైరస్ ను అరికట్టేందుకు కేవలం వైద్య ఆరోగ్య కాకుండా సంబంధిత శాఖలకు కూడా బాధ్యత ఉందన్నారు. జిల్లాలో కరోనా పోజిటివ్ కేసులను గుర్తించడం జరిగిందని, ఆ ప్రాంతాల్ని కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడం జరిగిందన్నారు. ఈ వైరస్ నుండి కోలుకున్న తరువాత వారిని తమ ఇళ్లకు పంపడం, వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. 28రోజులు పాటు కంటైన్మెంట్ అయిన తరువాత ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రజాజీవనానికి ఎటువంటి ప్రభందకాలు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా గ్రీన్ జోన్ ప్రాంతాల్లో సడలింపులు ఉంటాయని కలక్టర్ తెలిపారు. ఇక మీదట కరోనా వైరస్ లక్షణాలు ఉండడం తో పాటు హైరిస్క్ ఉండే వారికి మాత్రమే కోవిడ్ వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో పోజిటీవ్ వచ్చిన వాళ్లతో పాటు పరీక్ష చేసిన వారందరు కోలుకుంటున్నారన్నారు. 60 సంవత్సరాలు పై బడిన వారందరు సుగరు, బీపి, హర్ట్ ప్రోబ్లమ్స్ ఉన్న వారికి తగిన విధంగా వైద్య సేవలు అందించాలన్నారు. హైరిస్కు కేసులున్న ప్రాంతాల్లో ఉన్న వారికి మాత్రమ్ వైద్య ఆరోగ్య శాఖ, ఇతర శాఖలు ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ఇంటివద్దనే ఉంటామన్న వారికి హోమ్ క్వారంటైన్ లో ఉండవచ్చునని కలక్టర్ తెలిపారు. ఎటువంటి సౌలబ్యాలు లేని వాళ్లను కోవిడ్ కేర్ సెంటర్స్( సిసిసి) పంపడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా జిల్లాలో కరోనా నియంత్రణ విధుల్లో ఉంటున్న వారికి ఈ వైరస్ బారిన పడిన దాఖలు లేవన్నారు. ఈ వైరస్ పట్ల భయం అక్కర లేదని, కేవలం చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం దీనికి ఉపసమనమని కలక్టర్ పేర్కొన్నారు. ఈ వైరస్ అనేది సామూహికంగా తిరగడం నిబంధనలు పాటించక పోవడం వలన ఈ వ్యాధి సోకుతుందన్నారు. అదే విధంగా ప్రతి పి హెచ్ సిలో చేతులు శుభ్రం చేసుకునే ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన చేయాలన్నారు. ఉద్యోగులకు ఈ వైరస్ బారిన పడితే 14 రోజుల పాటు సెలవు మంజూరు చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న సర్వే రిపోర్టలను ఎప్పటికప్పుడు వైబ్ సైట్ లో నమోదు చేయాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్ ను మొబైల్ ల్లో డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. దీని వలన కోవిడ్ - 19 సంబంధించిన హెచ్చరికలు, సందేహాలు వస్తాయని, జాగ్రత్తలు పడడానికి అవకాశాలుంటాయని కలక్టర్ తెలిపారు. ప్రతి కార్యాలయంలో చేతులు కడుగుకోవడానికి శాశ్వత ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ నెల 3వ తేదీ తరువాత లాక్ డౌన్ సడలింపులుండే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలతో పాటు, మున్సిపల్ కార్పోరేషన్లు కంటైన్మెంట్ జోన్లు ఉన్నందున సడలింపులు ఉండదన్నారు. 3వ తేదీ నుండి డాక్టర్లు, అన్ని ఆసుపత్రులలో ఓపి సేవలు అందించవలసి ఉంటుందని పిహెచ్ సి డాక్టర్లకు సూచించారు. ప్రతి సిహెచ్ సిలో ఒక కోవిడ్ గది ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ గదిని హైసోలేషన్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు ఉండాలని అన్నారు. 3వ తేదీ నుండి ఆసుపత్రులు చాలా రద్దీగా ఉంటున్నందున సి హెచ్ సిలో డాక్టర్లు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆసుపత్రికి వచ్చిన రోగులకు తప్పని సరిగా మాస్కులు ధరించాలని అన్నారు. భౌతిక దూరం పాటించే విధంగా సర్కిల్స్ ను ఏర్పాటు చేయాలని కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి పలు సూచనలు చేసారు. కోవిడ్-19 పై తీసుకుంటునచర్యలను సమీక్షించిన జిల్లా కోవిడ్-19 ప్రత్యేకాధికారి కాంతిలాల్ ధాండే ! ఈ నెల 3వ తేదీ తరువాత లాక్ డౌన్ సడలింపు ఉంటే అవకాశం ఉన్నందున ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కోవిడ్ ప్రత్యేకాధికారి కాంతిలాల్ ధాండే తెలిపారు. శుక్రవారం కాకినాడ కలక్ట రేటు లోని కోవిడ్-19 పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలక్టర్లతో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 3వ తేదీ తరువాత లాక్ డౌన్ సడలింపులు ఉంటున్నందున ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కాలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రతి పిహెచ్ సిలలో చేతులు శుభ్రపరడం, మాస్కులు దరించడం భౌతిక దూరం పాటించే విధంగా తప్పని సరిగా చేయాలన్నారు. ప్రతి పిహెచ్ సిలో ఒక కోవిడ్-19 గదిని సిద్ధం చేసుకోవాలన్నారు.


                                                                  ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దాండే రంపచోడవరం, ఎటపాక, ఐటిడిఏలతో పాటు మున్సిపాలిటీ కమీషనర్లు, అడ్డతీగల, చింతూరు, సఖినేటిపల్లి పిహెచ్ సి డాక్టర్లతో తీసుకుంటున్న చర్యలను నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ( సమాచార శాఖచే జారీ)


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు