29 ;;మొత్తము మృతులు;;;తెలంగాణలో పెరుగుతున్న కేసులు




శనివారం కరోనా ధాటికి ఒకరు చనిపోయారు. ఈ మరణంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 29 మంది కరోనా వల్ల చనిపోయినట్లయింది.తగ్గినట్టే తగ్గుతూ పెరుగుతున్నాయి ... 




 



                                                                                                         తెలంగాణలో కరోనా వైరస్ కేసులు శనివారం కాస్త పెరిగాయి. శుక్రవారం సింగిల్ డిజిట్‌కే పరిమితమైన కరోనా కేసులు శనివారం 17 నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కరోనా కేసులు 1061కు చేరుకున్నాయి. అంతేకాక, శనివారం కరోనా ధాటికి ఒకరు చనిపోయారు. ఈ మరణంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 29 మంది కరోనా వల్ల చనిపోయినట్లయింది.


                                                                                                        ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 533 ఉండగా.. 499 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. శనివారం కొత్తగా నమోదైన కేసుల్లో 15 జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా మరో రెండు 2 రంగారెడ్డి జిల్లాలో గుర్తించారు. శనివారం 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలోని వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. గత 14 రోజుల వ్యవధిలో మరో 16 జిల్లాల్లో ఒక్క కరోనా కొత్త కేసు కూడా నమోదు కాలేదు.




కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు