గ్రేడ్-2 లాబ్ టెక్నిషియన్ పోస్ట్లులు ;;కాంట్రాక్టు పద్ధతి లో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానం
తూర్పు గోదావరి ;వైద్య ఆరోగ్య శాఖ తూర్పు గోదావరి జిల్లా విభాగంలో ఖాళీగా ఉన్న గ్రేడ్-2 లాబ్ టెక్నిషియన్ పోస్ట్ లలో కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5 గం.లలోపున డియంహెచ్ఓ, కాకినాడ కార్యాలయంలో తమ ధరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో మొత్తం 51 గ్రేడ్-2 లాబ్ టెక్నిషియన్ పోస్ట్ లకు ఈ నియామకాలు నిర్వహిస్తున్నామని, ఈ పోస్ట్ కు నెలకు 28 వేల రూపాయల జీతం చెల్లించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు ఇంటర్మీడియేయ్ సైన్సు/ఇంటర్మీడియేట్ ఓకేషనల్ కోర్సుతో పాటు, సంవత్సరం అప్రెంటీస్, సాంకేతిక అర్హతలు బిఎస్సి (ఎం.ఎల్.టి)/డి.ఎం.ఎల్.టి/ఎం.ఎల్.టి విద్యార్హతలు కలిగి ఉండాలని, పారామెడికల్ బోర్డ్ రిజిష్ట్రేషన్ తప్పని సరిగా చేయించుకుని ఉండాలని తెలియజేశారు. తమ ధరఖాస్తుతో పాటు విద్య, సాంకేతిక అర్హతల సర్టిఫికేట్లతో పాటు, మార్కుల జాబితాలు, కుల ధృవీకరణ పత్రం, 4 నుండి 10వ తరగతి వరకూ చదివిన స్టడీ సర్టిఫికేట్స్ నకళ్లతో అభ్యర్థి పేరు, పోస్టల్ అడ్రస్ తో పాటు ఫోన్ నెంబరు వ్రాసిన కవరు జతపరచి ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5 గం.లలోపు సామాజిక దూరం పాటిస్తూ డియంహెచ్ఓ, కాకినాడ కార్యాలయంలో అందజేయాలని ఆయన తెలిపారు. ధరఖాస్తు, ఇతర వివరాల కొరకు అభ్యర్థులు eg.ap.gov.in/medrec వెబ్ సైట్ ను సందర్శించాలని తెలియజేశారు. తగిన ఆధారాలతో కూడిన ధృవపత్రాలను తిరస్కరించడం జరుగుతుందని, వాటివై ఏ విధమైన ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండవని స్పష్టం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి