జి . మామిడాడ ;కరోన విజృంభణ ;;...ప్రశాంత గ్రామంలో భయాందోళనలు .. మండలం నుండి మరో మండలానికి ... కరోనా పాజిటివ్ కేసులు 19




 


  • పెదపూడి,(తూర్పు గోదావరి ): కరోనా మహమ్మారి ప్రశాంతంగా ఉన్న గొల్లలమామిడాడ గ్రామాన్ని ఒక్కసారిగా చుట్టుముట్టింది. కరోనా సోకి ఒక వ్యక్తి మృతి చెందడంతో గ్రామస్థులు భయాందోళనలతో కరోనా టెస్టులకోసం ఎగబడ్డారు.ఇప్పటికే శుక్రవారం 8 మందికి నిర్దారణ కాగా శనివారం 213 మందికి పరీక్షలు నిర్వహించగా 19 మందికి  కరోనా వైరస్ సోకింది వీరిలో 13 మంది మామిడాడకు చెందిన వారు కాగా 6గురు బిక్కవోలు కు చెందిన వారు .. ఇదిలా ఉండగా   కంటోన్మెంటు జోన్ గా ప్రకటించిన మామిడాడ బసివిరెడ్డి పేటకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా శనివారం  పరీక్షలు చేయించుకుంటున్నారు. 


పెదపూడి మండలం గొల్లలమామిడాడ గ్రామంలో గత మూడు రోజులుగా కరోనా మహమ్మారి కలకలం రేపింది. ఒక వ్యక్తి మృతి చెందడంతో కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలలో శుక్రవారం 8 మందికి పాజిటివ్ రాగా, శనివారం 213 మందికి పరీక్షలు నిర్వహించగా 19 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా వైధ్యాదికారులు  ప్రియాంక వెల్లడించారు. దీనిలో మామిడాడకు చెందిన వారు 13 మంది కాగా బిక్కవోలుకు చెందిన వారు 6 మందిగా ప్రకటించారు. వీరంతా మృతునితో సన్నిహితం గా ఉన్నవారే. దీనిలో మృతునికి వైద్యసేవలు అందించిన ఒక ఆర్ఎంపి డాక్టర్ కు కూడా కరోనా పాజిటివ్ రావడంతో సంపర,వేండ్ర, గండ్రేడు, చింతపల్లి, గొల్లలమామిడాడ, పెద్దాడ గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. మామిడాడ మెయిన్ రోడ్ లో గల బేకరీ యజమానికి కూడా కరోనాన  పాజిటివ్ రావడంతో ఆయన అద్దెకు ఉండే స్వర్ణమయి అపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. వారంతా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేందుకు సిద్దం అవుతున్నారు. ఆర్ఎంపి డాక్టర్ వద్ద వైద్యసేవలు పొందిన వారు కూడా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని పంచాయితీ కార్యదర్శి అచ్చిరాజు సామాజిక మాధ్యమాల ద్వారా కోరారు.                                                                                                                                                                                                                                                                            అలాగే మామిడాడ బాలుర ఉన్నత పాఠశాలలో, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీసు నందు 500 మందికి రాఫిడ్ కిట్ల ద్వారా  కరోనా పరీక్షలు శనివారం నిర్వహించారు. వీరిలో పాజిటివ్ వచ్చిన వారిని కారంటైన్ కు పంపిస్తారు.

...కంటోన్మెంటు జోన్ లను పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ 

గొల్లలమామిడాడ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటోన్మెంటు జోన్ లు, రెడ్ జోన్ లను జిల్లా ఎస్పీ నయీం అస్మీ, డీఎస్పీ భీమారావులు పరిశీలించారు. భద్రత కట్టుదిట్టం చెయ్యాలని, గ్రామం నుంచి ఎవరు బయటకు వెళ్ళకుండా, గ్రామంలోకి ఎవరు రాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. లాక్ డౌన్ ఏర్పాట్లుపై కాకినాడ రూరల్ సిఐ మురళీ కృష్ణ, ఎంపీడీవో విజయభాస్కర్, తహశీల్దార్ రాజ్యలక్ష్మీలను అడిగి తెలుసుకున్నారు. రెడ్ జోన్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు.


 

 



 

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు