జిల్లాలో కోవిడ్-19 ఆస్పత్రిలో నియమింపబడిన స్టాఫ్ నర్స్ ఎఫ్.ఎన్.ఓ., ఎం.ఎన్.ఓ. సిబ్బంది సేవా భావంతో విధులు నిర్వహించాలి

జిల్లాలో కోవిడ్-19 ఆస్పత్రిలో నియమింపబడిన స్టాఫ్ నర్స్ ఎఫ్.ఎన్.ఓ., ఎం.ఎన్.ఓ. సిబ్బంది సేవా భావంతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు.              కాకినాడ ;సోమవారం కలెక్టర్ కార్యాలయం విధాన గౌతమి హాల్ నందు కోవిడ్ ఆస్పత్రిలో అవసరమైన వైద్య సిబ్బందికి సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించె కార్యక్రమానికి జిల్లా కలెక్టర్  ముఖ్యఅతిథిగా పాల్గొని, అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వున్న 6 కోవిడ్ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించడానికి గాను అవసరమైన సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. మధ్యవర్తులు దళారులను ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని పూర్తిగా పారదర్శకంగా అధికారుల సమక్షంలో ఎంపిక జరిగిందన్నారు. స్టాఫ్ నర్స్ ఎఫ్.ఎన్.ఓ., ఎం.ఎన్.ఓ. సిబ్బంది సేవా భావం, నిజాయతీతో విధులు నిర్వర్తించాలన్నారు. జిజిహెచ్ కాకినాడ, డి ఎం హెచ్ ఓ, రాజమహేంద్రవరం డి సి హెచ్ ఎస్ విభాగాల్లో  స్టాఫ్ నర్స్ పోస్టులు, ఎఫ్ ఎన్ ఓ, ఎమ్ ఎన్ ఓ, స్వీపర్ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.  స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి ఒక సంవత్సరం కాంట్రాక్టు పద్ధతిలోనూ, ఎఫ్ ఎం ఎన్,ఎం ఎన్  ఓ పోస్టులకు సంబంధించి ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.  జిల్లాలో ఉన్న కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం  కోవీడ్ -19 ఆసుపత్రుల్లో  ప్రత్యేకమైన సందర్భాలలో విధులు నిర్వర్తించేందుకు అభ్యర్థులందరూ సిద్ధంగా ఉండాలన్నారు. నియామకం పత్రాలు అందుకున్న అభ్యర్థులు సంబంధిత  ఆసుపత్రిలలో  రిపోర్ట్ చేసి, రేపటినుండి విధులకు హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.  


జె సి-2 జి.రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 6 కోవిడ్ ఆస్పత్రిలలో అవసరమైన వైద్య సిబ్బంది నిమిత్తం స్టాఫ్ నర్సులు-83, ఎం ఎన్ ఓ లు-109, ఎఫ్ ఎన్ ఓ లు-42, స్వీపర్-91 పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. అనంతరం కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జెసి-2 జి రాజకుమారిలు అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు.


            ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ బి సత్య సుశీల, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపర్డెంట్ ఎం రాఘవేంద్రరావు, రాజమహేంద్రవరం డి సి హెచ్ ఎస్ రమేష్ కిషోర్ ,రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ బాబ్జి , డా మల్లికార్జున్ ఇతర అధికారులు , తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు