సేవలు ..ఘనం -జీతాలకు...సున్నం -కోవిడ్ 19తో యుద్ధం - “108”లో ప్రాణాలు - గాల్లో జీతాలు - రక్తం పీలుస్తున్న బీవీజీ

వారి జీవితాలు కాటికాపరి కన్నా హీనంగా ఉన్నాయి..నిత్యం రోగాల మధ్య జీవించే వారి బ్రతుకులు కడు దీనంగా మారాయి...నిరంతరం వారి సేవలు ఘనంగా ఉంటాయి కానీ వారికి అందించే జీతాలు గాల్లో అందని ద్రాక్షగా మారాయి...రెక్కాడితేనే కానీ డొక్కాడని వారి బ్రతుకులు “108"లో జీవంతో పోరాడే జీవితాల కన్నా కడు హీనంగా మారాయి..వారి కష్టానికి తగ్గ ఫలితం అందివ్వని పాపం ఎవరిది...ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో యంత్రంలా పనిచేస్తూ క్షణం.. క్షణం...కరోనా వైర'పోరాటం చేస్తున్న 108 సిబ్బందిని పట్టించుకునే నాధుడే లేడా...వారి ఆర్తనాదాలు సేవలు ఉపయోగించుకునే ప్రభుత్వ అధికారులు, పాలకులు ఎందుకు నిమ్మకు నిరేతి నట్లు వ్యవహరిస్తున్నారు....                                                                              కాకినాడ ప్రతినిధి, అక్షర లీడర్ : తూర్పు గోదావరి జిల్లాలో 186 మంది 108 సిబ్బంది గత రెండు నెలలుగా జీతాలు లేక అల్లాడుతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకున్నా క్షణంపట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. వారికి సేవలు ఉపయోగించుకుంటూ రెండు నెలలుగా జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం, బీవీజీ యాజమాన్యం 108 ఉద్యోగులను తీవ్ర ఆర్థిక ఇబ్బందులుకు గురిచేస్తున్నారు. కరోనా కేస్లు చేస్తూ తమ ప్రాణాలను సైతం వ్యవహరిస్తున్నారుసేవలు ..ఘనం -జీతాలకు...సున్నం, లెక్క చేయకుండా పగలనక, రాత్రనక కష్టాల కడలిలో ఏ దారి లేక ఇబ్బందులు పడుతున్న 108 ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. జిల్లా మొత్తం మీద 186 మంది ఉద్యోగులం ఉన్నారు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా హూటా హుటీనా పరుగులు తీసే వారి జీవితాలలో కడుపుకు అన్నం తింటున్నారో లేదోనని ఆలోచించాల్సిన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని దళిత నాయకురాలు ఏనుగుపల్లి జ్యోతి ప్రశ్నిస్తున్నారు.                          గత రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదుని బీవీజీ యాజమాన్యం వచ్చినపుడు నుండి ఏ నెల కూడా పూర్తిల్లగా జీతాలు సమయానికి ఇవ్వడం లేదని 108 సిబ్బంది తెలిపారు. అంతే కాకుండా తమకు శెలవు తీసుకునే అవకాశం కూడా ఉండదని, ఆరోగ్యం బాగోలేక ఒక రోజు సెలవు పెట్టినా జీతం కట్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రస్తుత కరోనా వైరస్ కారణంగా లాఖడౌన్ విధించారని ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో కూడా మా ప్రాణాలు పణంగా పెట్టి మా కుటుంబాల ప్రాణాలకు రిస్క్ ఉందని తెలిసి కూడా కోవిడ్ 19 ఆపరేషన్స్ లో పాల్గొంటున్నామని ఆక్రోషించారు. జీతాలు కోసం ప్రతీ నెలా ఎదురు చూసే పరిస్థితి ఎదురైందని,                                                                                                                   లాక్ డౌన్ సమయంలో ఎవరూ అప్పు కూడా ఇవ్వని పరిస్థితిలో తమ బ్రతుకులు నడి సంద్రంలో నావలా ఉందని 108 సిబ్బంది తెలిపారు. 108 నిర్వాహణ చేస్తున్న బీవీజీ యాజమాన్యం వారిని అడిగితే ప్రభుత్వం నుండి మాకు బిల్స్ రావడం లేదని ఘాటుగా జవాబిస్తున్నారని తెలిపారు. ఓ ప్రక్క | ప్రభుత్వం జీతాలు పెంచుతామని ప్రకటనలిస్తుంది. ఇక్కడేమో తిండి లేక రక్తనాళాలు పగిలిపోతున్నాయని తిన్నాకి కూడులేక అల్లాడుతుంటే మీసాలకు సంపెంగి నూనె రాస్తామని ప్రభుత్వం చెప్పే కబుర్లు విని సంతోషించాలో లేక కడుపు మాడి చావాలో తెలియని అగమ్య గోచారంలో ఉన్నామని వారన్నారు. 108 సిబ్బంది జీతాలు వెంటనే చెల్లించి లాక్  డౌన్ సమయంలో వారిని ఆదుకోవాలని లేనిచో అందోళన చేయడం జరుగుతుందని దళిత నాయకురాలు ఏనుగుపల్లి జ్యోతి  హెచ్చరించారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు