అమలాపురం;;మే 17 వరకు సడలింపు లతో కూడిన లాక్ డౌన్ అమలు;;రెవెన్యూ డివిజనల్ అధికారి బి హెచ్ భవాని శంకర్

అమలాపురం;;ముమ్మిడివరం: అక్షర లీడర్: కరోనా విపత్తు కారణంగా అమలాపురం డివిజన్ లో మే 17 వరకు సడలింపు లతో కూడిన లాక్ డౌన్ అమలు చేయడం జరుగుతుందని అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి బి హెచ్ భవాని శంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమలాపురం డివిజన్ ఆరంజ్ ఫోన్ లో ఉందని మరొక 21 రోజులపాటు జిల్లాలో ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కాకపోతే అమలాపురం డివిజన్ ను గ్రీన్ జోన్ గా ప్రకటించడం జరుగుతుందని ఆర్డిఓ తెలిపారు.                                                                             నేటి నుండి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు నిత్యావసర సరుకులు విక్రయించే షాపులకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని, పెద్దపెద్ద దుకాణాలు, షాపింగ్ మాల్స్క, సినిమా థియేటర్లకు, పెద్ద పెద్ద షో రూమ్ లకు, బిగ్ బజార్ లకు అనుమతులు లేవని అమలాపురం ఆర్డీవో భవానీశంకర్ తెలిపారు. ప్రజలు సమూహాలుగా తిరిగే అవకాశం ఉన్న వివాహ కార్యక్రమాలు, దైవ సంబంధిత కార్యక్రమాలు వంటి వాటిని సడలింపు లతో కూడిన అనుమతులు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. లాక్ డోన్ ముగిసేవరకు మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధించడం జరిగిందని అన్నారు. మోటర్ బైక్ పై ఇద్దరికీ అనుమతి ఉందని అన్నారు. లాక్ డోన్ అమలకు ప్రభుత్వానికి సహకరించిన ప్రజలకు ఆర్డీవో కృతజ్ఞతలు తెలిపారు. మే 17 వరకు ఉన్న సడలింపు లతో కూడిన లాక్ డౌన్లో ప్రజలందరూ బాధ్యతగా భావించి క్రమశిక్షణతో మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ లాక్ డౌన్ విజయవంతం చేయాలని ఆర్ డి ఓ విజ్ఞప్తి చేశారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు