తూర్ప నుండి 1440 మంది స్వస్థలాలకు తరలింపు
తూర్పుగోదావరి;;మే 16వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ లోని 11 జిల్లాలకు సంబంధించిన 14 వందల 40మందిని వారి స్వస్థలాలకు పంపించడం జరిగిందని కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేసారు. జిల్లాల వారిగా చూస్తే శ్రీకాకుళం జిల్లాకు 641 మంది, విశాఖపట్నం జిల్లాకు 324మంది, విజయనగరం జిల్లాకు 376మంది, పశ్చిమ గోదావరి జిల్లాకు 28 మంది, గుంటూరు జిల్లాకు 39 మంది, కృష్ణా జిల్లా 21 మంది, ప్రకాశం జిల్లాకు ఇద్దరిని, నెల్లూరు జిల్లాకు ఇద్దరిని, చిత్తూరు ఒక్కరిని, కర్నూలు ముగ్గరుని,కడప జిల్లాకు ముగ్గురిని, ఆర్ టి సి బన్ల ద్వారా పంపించినట్లు తెలియజేసారు. అదే విధంగా తూర్పుగోదావరి నుండి ఇతర రాష్ట్రాలకు 1404 మందిని వారి సొంత రాష్ట్రాలకు పంపించినట్లు ఆయన తెలియజేసారు. బిహార్ కు చెందిన 566మందిని రైళ్ల ద్వారా, ఒడిస్సా రాష్ట్రానికి చెందిన 751 మందిని ఎపిఎస్ఆర్ టిసి ద్వారా, పశ్చిమ బెంగాల్ కు చెందిన 39మందిని బస్టు ద్వారా, తెలంగాణకు చెందిన 48మందిని బస్టు ద్వారా వారి స్వరాష్ట్రాలకు పంపించినట్లు ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్, ఇతర జిల్లాలు మరియు ఇతర రాష్ట్రాల నుండి తూర్పు గోదావరి జిల్లాకు 2,327 మంది వచ్చినట్లు ఆయన తెలియజేసారు. వారిలో పశ్చిమ గోదావరి నుండి 230మంది, విశాఖపట్నం నుండి 115మంది, ప్రకాశం జిల్లా నుండి 1234మంది, కృష్ణా జిల్లా నుండి 34మంది, గుంటూరు జిల్లా నుండి 396మంది ఒడిస్సా రాష్ట్రం నుండి 19మంది, తెలంగాణ రాష్ట్రం నుండి 201 మంది, వారనాసి నుండి 98మంది జిల్లాకు వచ్చినట్లు ఆయన తెలియజేసారు. స్పందన పోర్టల్ లో ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో వున్న 8741 మంది రైళ్లు ద్వారా తమ స్వస్థలాలకు పోవుటకు రిజిష్టరు చేయించుకున్నారు. అదే విధంగా ఇతర రాష్ట్రాల నుండి తూర్పుగోదావరి జిల్లాకు రైళ్లు ద్వారా వచ్చుటకు 18552వుంది రిజిష్టరు చేయించుకున్నారని ఆయన తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి