తూర్పున 12 కంటైన్మెంట్ జోన్లు ;;ఇతర దేశస్తులు 3442; వలస కార్మికులు 883;;ఇతర జిల్లాల వారు 656 మంది జిల్లాలో ఉన్నారు

                                                                                                          కోవిడ్ -19 దృష్ట్యా ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో 3442 మంది వున్నారని కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. వారిలో భారత ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం 2814 గాను, ఆశ, ఏఎన్ఎంల సర్వేల ద్వారా 628 మంది లో 3442 మంది ఉన్నట్లు తెలిపారు. వీరిలో కరోన లక్షణాలు ఉన్న వారు ఒకరు గాను, మిగతా వారు ఎసిమ్టమాటిక్ గా 3441 గా ఉన్నారన్నారు. ప్రభుత్వ నిబంధనల మేర డిస్చార్జైన ప్రతీ ఒక్కరికీ రెండు వేల రూపాయల చొప్పున చెల్లించడం జరుగుతుందన్నారు. ఇప్పటికి 16 మందికి 32 వేల రూపాయలు చెల్లించామన్నారు.జిల్లాలో 18 కంటైన్మెంట్ జోన్లు గుర్తించగా, ఆరిటిని రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం 12 జోన్లు పని చేస్తున్నాయన్నారు. (1) కత్తిపూడి, శంఖవరం మండలం, (2)వార్డు నెం. 5, వైయస్ఆర్ గార్డెన్ పిఠాపురం మున్సిపాలిటీ, (3) రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో ఆవా- వాంబే కాలనీ, (4)నారాయణపురం, (5) వార్డు నెం. 28, 29, మంగళవారపు పేట, (6) వార్డు నెం.30 -బెస్తా వీధీ, (7) వార్డు నెం. 3- రాజేంద్రనగర్, (8) పోస్టాఫీసు వీధి, ఎసి గార్డెన్స్, (9) కొంతమూరు రాజమహేంద్రవరం రూరల్, (10) వార్డు నెం. 9-ఉప్పు వారి వీధి, సామర్లకోట, (11) వార్డు నెం. 6, పెద్దాపురం, (12) వార్డు నెం. 19, 20 తుని కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలోనే ఉండాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఎటువంటి అనుమతులు లేవన్నారు.


                                                                                                                  జిల్లాలో 55 లక్షల మంది జనాభా ఉన్నారని, ఒక్కొక్కరికీ మూడు మాస్కలు చొప్పున కోటి 65 లక్షలు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 65 లక్షలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లు ఎపిటిడ్ కో , ధవళేశ్వరంలో 1000 రూములు, 1000 బెడ్స్ సిధ్ధం చేశామన్నారు. క్వారంటైన్-కమ్-ఐసొలేషన్ సెంటర్లలో 61 రూములు, 8823 బెడ్ లు గుర్తించామన్నారు. ఆరు క్వారంటైన్ సెంటర్లకు గాను ధవళేశ్వరంలో 160, జెఎన్.టి.యు., కాకినాడ-134, అన్నవరం-102 , జిజిహెచ్, కాకినాడ-5, జిల్లా ఆసుపత్రి, రాజమహేంద్రవరం-2, కిమ్స్ ఆసుపత్రి, అమలాపురం -2, మొత్తం 405 మంది ఉన్నారని కలక్టర్ తెలిపారు. 42 షెల్టర్స్ ద్వారా 1,764 మందికినివాసయోగ్యం, 35 ఎన్.జి.ఓ. గ్రూపుల ద్వారా 5148 మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో 883 వలస కార్మికులు ఉన్నారని, వీరిలో మన జిల్లా వారు 227 మందిగా ఉన్నారన్నారు. ఇతర జిల్లాలవారు 656 మంది ఉన్నారన్నారు. అనంతపురం-2, చిత్తూరు-4, గుంటూరు -8, కడప-3, కర్మూల్-2, కృష్ణ-45 , నెల్లూరు -6, ప్రకాశం-5, శ్రీకాకుళం-267, విశాఖపట్నం-185, విజయనగరం -83, పశ్చిమ గోదావరి -46 మందిగా ఉన్నారన్నారు.


                                                                                               దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి మన జిల్లాలో మొత్తం 1,883 మంది వలస కార్మికులన్నారన్నారు. వీరిలో డిఆర్డిఓ, మెప్మా కల్పించిన షెల్టర్ల ద్వారా 567 మంది, ఫ్యాక్ఠరీస్ కల్పించిన వసతిలో 791, అసంఘటిత రంగంలో 525 మందిగా ఉన్నారన్నారు. ఇప్పటికే జిల్లాకు పశ్చిమ గోదావరి జిల్లా నుండి 163, ప్రకాశం నుండి 153 మొత్తం 316 మంది వచ్చారన్నారు. ఇతర రాష్ట్రాల నుండి మన జిల్లాకు రావడానికి దరఖాస్తు చేసుకున్న వారిలో 533 మందిగా ఉన్నట్లు కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి పాత్రికేయులకు వివరించారు.


కోవిడ్-19 కు సంబంధించి కంట్రోల్ రూమ్ లు దేశ వ్యాప్తంగా 011-23978046, స్టేట్ వైడ్ (1) 104, (2) 1902, (3) 0866-2410978, జిల్లా లో (1) 9392324287, (2)0884-2356196,(3) 18004253077(సాధారణ), టెలి మెడిసిన్ కొరకు (1) 0884-2333466, (2) 0884-2333488, (3) 14410 సంప్రద్రించవచ్చని కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి ప్రజలకు సూచించారు.     


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు