నితిన్  అరాచకం..;;100 M వ్యూస్ రాబట్టిన సినిమా..

 ఈ మధ్యకాలంలో తెలుగు హీరోల సినిమాలకు వెండితెరపై కంటే యూట్యూబ్‌లోనే ఎక్కువ వ్యూస్ దక్కుతున్నాయి. తాజాగా నితిన్ సినిమా కూడా యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది.


 


                                                                                                                           లో తెలుగు హీరోల సినిమాలకు వెండితెరపై కంటే యూట్యూబ్‌లోనే ఎక్కువ వ్యూస్ దక్కుతున్నాయి. అంతేకాదు ఇక్కడ ఫ్లాప్ అయిన సినిమాలు హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే 100 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. రీసెంట్‌గా రామ్, పూరీ జగన్నాథ్‌ల ‘ఇస్మార్ట్ శంకర్’ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా టాలీవుడ్ భీష్మ.. అదేనండి నితిన్ హీరోగా నటించిన ‘శ్రీనివాస్ కళ్యాణం’ హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. అదే సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది. 7 నెలల క్రితం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ చిత్రం తాజాగా వంద మిలియన్ వ్యూస్ రాబట్టింది. మొత్తంగా బాహుబలి పుణ్యామా అని ఇపుడు తెలుగు సినిమాలకు హిందీలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇక్కడ ప్రేక్షకులు తిరస్కరించిన సినిమాలను అక్కడ ఆడియన్స్ మాత్రం వందల మిలియన్ కొద్దీ వ్యూస్ అందిస్తున్నారు. మొత్తానికి తెలుగు సినిమాలకు హిందీ డబ్బింగ్ రూపేణా మంచి ఆదాయమే వస్తోంది.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు