కోవిడ్ ఆసుపత్రులలో వైద్యులు
తూ . గో ;;జిల్లాలో కోవిడ్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించడానికి అవసరమైన డాక్టర్లను నియమించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం కలెక్టర్ కార్యాలయం నందు కోవిడ్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించడానికి గాను డాక్టర్ల నియామకానికి సంబంధించి వాకెన్- ఇంటర్వ్యూస్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ ఆస్పత్రులలో అవసరమైన డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిని నియమించడం జరుగుతుందని, ఈ రోజు నిర్వహించిన ఇంటర్వ్యూలో ఒక ఎనాష్ఠియా (మత్తు) డాక్టర్ ను ఒక సంవత్సరం కాంట్రాక్టు పద్ధతిలో నియమించడం జరిగిందన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుర్తింపు కలిగి ఎనాప్టియా, జనరల్ మెడిసిన్,పల్మనాలజిస్ట్ విభాగాలకు చెందిన డాక్టర్ల సేవలు అవసరమైతే వినియోగించుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డిఎంజీహెచ్ఓ బి.సత్యసుశీల, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాఘవేంద్రరావు, రాజమహేంద్రవరం డిసిహెచ్ఎస్ రమేష్ కిషోర్, రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ బాబ్ది, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి