సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి గౌతం సవాంగ్ హెచ్చరించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు తగవని ఆయన అన్నారు. వ్యవసాయ కార్యకలాపాలు, పరిశ్రమలకు అనుమతిచ్చినట్లు తెలిపారు. అన్ని శాఖలతో పోలీసుల వారు సమన్వయం చేసుకుంటున్నారని, రెడ్ జోన్ ప్రాంతాల్లో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. విదేశాలు, దిల్లీ నుంచి వచ్చిన వారి ద్వారా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయన్నారు.
కరోనా నియంత్రణ చర్యల్లో వైద్యుల కృషి ఉన్నతమైనదని కొనియాడారు. కరోనా వైరస్ నియంత్రణ అనేది జాతీయ విపత్తు లాంటిదని, దీనివల్ల వ్యవసాయం రంగం, పారిశ్రామికీకరణపై తీవ్ర ప్రభావం పడిందన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి