మూడు గ్రామాల్లో కూరగాయు పంపిణీ చేసిన వసంతరాయుడి ఫ్యామిలి
సామర్లకోట, :అచ్చంపేట,అచ్చంపేట పంచాయితీ పరిధిలోని కొప్పవరం,బ్రహ్మనందపురం గ్రామాలో బుధవారం వీరంరెడ్డి వసంతరాయుడు కుటుంభ సభ్యులు భారీ ఎత్తున కూరగాయలు పంపిణీ చేసారు.స్వర్గీయ వీరంరెడ్డి వసంతరాయుడు సామర్లకోట మండంలోనే కాదు జిల్లాలోనే పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తుల్లో ఒకరు.ఆయన చేసిన సేలు ఇప్పటికి పలువురు చెప్పుకుంటూ ఉంటారు.ఆ రోజుల్లో పెదల పట్ల ఆయన చూపిన అభిమానం సేవ కార్యక్రమాలు ఎనలేనివి.అచ్చంపేట గ్రామానికి చెందిన ఆయన కుటుంబీకులు ఇప్పటికి ఆయన సేవలను కొనసాగిస్తున్నారు.అయితే ప్రస్తుతం కరోనా నిర్మూళనలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.దీనిని దృష్టిలో పెట్టుకుని వసంతరాయుడి మనుమలు ఆయన వారసులు ఆయన ఆశయాలను నెరవేరుస్తున్నారు. పెదలకు ఎ్లల ప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ వీరంరెడ్డిపెద్ద బాబు,మాజీ ఎంపిటిసి చిన్నబాబు,మాజీ సర్పంచ్ రమేష్,బాబూరావ్,డా. బాబీ బుధవారం అచ్చంపేట గ్రామంలోనే కాకుండా కోప్పవరం,బ్రహ్మానందపురం గ్రామాల లో గడప గడపకు సుమారు 1500 వందల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసారు.వారు చేసిన ఈ సేవ కార్యక్రమానికి ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి