ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
ప్రముఖ టీవీ యాంకర్ విశ్వశాంతి అనుమానాస్పద మృతి
పలు టీవీ సీరియల్స్‌లో నటించిన విశ్వశాంతి. అమీర్ పేట ఎల్లారెడ్డిగూడెం ఇంజనీర్స్ కాలనీలో నివాసం ఉంటున్న యాంకర్ నటి,విశ్వశాంతి అనుమానాస్పద మృతి. కేసు నమోదు చేసి పోలీసులు.
ప్రముఖ టీవీ యాంకర్, సీరియల్ నటి శాంతి( విశ్వశాంతి) అనుమానస్పదంగా మృతి చెందారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడెం ఇంజనీర్స్ కాలనీలోని తన నివాసంలో గురువారం ఆమె శవమై కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా ? లేక ఎవరైనా చంపేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎలా చనిపోయిందనేదానిపై చుటుపక్కల వారిని కూడా విచారిస్తున్నారు. శాంతి మరణంతో పలువురు టీవీ నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి