జర్నలిస్టులే నిరంతర ప్రజా సేవకులు :దవులూరి
సామర్లకోట;:సమాజానికి నాలుగో స్దంభంగా ఉంటూ నిరంతరం ప్రజల మధ్యలో సేవకులుగా సేవలందించే సమాచార సారధులు పాత్రికేయులేనని పెద్దాపురం నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జ్ దవులూరి దొరబాబు అన్నారు.ఆదివారం స్దానిక ప్రసంన్నాంజనేయ నగర్‌లో సామర్లకోట పాత్రికేయులకు 25 కేజీల బియ్యం,10 రకాు నిత్యావసర వస్తువులు,10 రకా కాయకూరలు దొరబాబు పంపిణీ చేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు అత్యంత జాగ్రత్తతో లాక్‌డౌన్ పాటిస్తున్నారని,ఇళ్లనుండి ఎవరూ బయటకు రాకుండా కరోనా వైరస్ నియంత్రణకు స్వియ నిర్భంధంలో పాటిస్తున్న తీరు మిగిలిన ప్రాంతాల వారికి ఆదర్శం కావాలన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా నియంత్రణలో భాగంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రజలకు ప్రభుత్వం తరుపునుండి అందిస్తున్న సేవాలు ,తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శం అవుతున్నాయన్నారు.యువత బయటకు రాకుండా కరోనా నియంత్రణకు సహకారం అందించాలని కోరారు.వివిధ స్వచ్చంద సంస్దలు,నాయకులు ,కార్యకర్తలు ,వ్యాపారులు నిరుపేదలకు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.నియోజకవర్గంలో ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి,భీమేశ్వర ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ మట్టపల్లి రమేష్‌బాబు,పట్టణ వైసిపి అద్యక్షులు మద్దాల శ్రీనివాస్,మాజి కౌన్సిలర్లు ఆవాల లక్ష్మీనారాయణ,కరణం కామేశ్వరరావు,మాజీ జెడ్‌పిటిసి బొబ్బరాడ సత్తిబాబు,,ఎలిశేట్టి నరేష్,నవర మాజి పిఎసిఎస్ అద్యక్షు తాటికొండ బాబ్జి,అచ్చంపేట సోసైటి అద్యక్షులు వీరంరెడ్డి నాని,వైసిపి నాయకులు యార్టగడ్డ జగదీష్,పాగా సురేష్,తలారి దొరబాబు,వల్లూరి వీర్రాజుచౌదరి,పాచర్ల సాయి,రెడ్నం దొరబాబు,కొప్పిరెడ్డి రాధాకృష్ణ,పేపేని సురేష్,గోకాడ రాజా,రాజేష్,బుజ్జి,తదితయి పాల్గోన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి