ప్రపంచ మేధావికి ఘన నివాళులు;;రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు కురసాల కన్నబాబు
తూ.గో ;;ప్రపంచ మేధావి, ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భారతదేశంలో జన్మించడం గొప్ప విశేషమని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు కురసాల కన్నబాబు తెలిపారు.
మంగళవారం బాబా సాహెబ్ భీం రావ్ రాంజీ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం పెనుగుదురు,నడకుదురు గ్రామాలలో మరియు కరప పి.హెచ్.సి సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి కన్నబాబు, కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత విశ్వనాథ్ లు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ అంబేద్కర్ లాంటి మహోన్నత వ్యక్తి మన దేశంలో పుట్టకపోయినా, మన దేశానికి రాజ్యాంగం రాయకపోయినా దేశంలో అన్యాయం, అసమానతలు ఎక్కువైపోయేవనన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వివక్షకు గురైన వారి పక్షాన పోరాడి,వారి ఉన్నతికి కృషి చేసిన మహామనిషి అంబేద్కర్ అని అన్నారు. బాల్యం నుండి ప్రతి చోట అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నత చదువులు అభ్యసించి భారతదేశం లాంటి పెద్ద దేశానికి లిఖిత రాజ్యాంగం రచించడం సామాన్యమైన విషయం కాదన్నారు. నేటి యువత ప్రతి ఒక్కరూ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం కరీనా లాక్ డౌన్ నేపథ్యంలో జిల్లాలోని ప్రజలందరూ ఇంటికే పరిమితం అయి కరీనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రస్తుత రబీ సీజన్లో మరో వారం రోజుల పాటు రైతులకు నీరు అందిస్తే పంట చేతికి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. మొక్కజొన్న, జొన్న, వరి, అరటి వంటి పంటలను రైతుల వద్ద నుండి కొనేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం మన రాష్ట్రంలోకి రాకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు. కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. తన మేధాశక్తితో భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహాన్నత వ్యక్తి అంబేద్కర్ అని ఎంపీ ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకు సమర్ధవంతంగా కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి తన మంత్రివర్గం అంతటినీ కరోనా వైరస్ నియంత్రణకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారన్నారు. ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని ఎంపీ తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో జిల్లాలోని వైద్యాధికారులు,డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది,పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిరంతరం సేవలందిస్తున్నారని మంత్రి, ఎంపీ వారిని అభినందించారు. ఈ సందర్భంగా కరప పోలీస్ అధికారి ఎస్ రామారావు, ఎంఈఓ కె.బి కృష్ణవేణి కరప గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు బంగారి అప్పారావు లను మంత్రి కన్న బాబు ఎంపీ వంగా గీత శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరప మార్కెటింగ్ చైర్మన్ కర్నాసుల సీతారామాంజనేయులు, తాసిల్దార్ విజయభాస్కర్ , కాకినాడ రూరల్ సి.ఐ మురళీకృష్ణ ,ఎంపీడీవో స్వప్న , పీహెచ్సీ వైద్యాధికారి డా.శ్రీనివాస్ నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి