ప్రభుత్వ ఆదేశాలు పాటించండి ;;ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోండి

                                                                                                          తూ . గో ;;రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను పాటిస్తూ జిల్లాలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అన్ని రంగాల ప్రజలు కోవిడ్-19 ముప్పు నేపద్యం సమాజ ఆరోగ్య భద్రత కొరకు భారత ప్రభుత్వం జారీ చేసిన ఆరోగ్య సేతు యాప్ ను తమ ఫోన్లలో తప్పని సరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి ఒక ప్రకటనలో కోరారు.   ప్రత్యేక ఆల్గారిథమ్ ద్వారా  ఈ యాప్ తమ సమీపంలో కోవిడ్-19 పాజిటీవ్ వ్యక్తి కాంటాక్ట్ లోకి వచ్చే అవకాశాన్ని గుర్తించి జాగ్రత్త వహించేలా  అప్రమత్తం చేస్తుందన్నారు.   కరోనా వైరస్ లక్షణాలను స్వయంగా గుర్తించేందుకు సహకరించి, అవసరమైతే వైద్య సేవలు పొందేందుకు సంప్రతించాల్సిన ఫోన్ నెంబర్లు, హెల్ప్ లైన్ సమాచారాన్ని అందిస్తుందని, తద్వారా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో ప్రభుత్వ యంత్రాంగానికి ఉపయుక్తంగా ఉంటుందని ఆయన తెలిపారు.   కోవిడ్-19 నియంత్రణ విధులలో పాల్గొంటున్న హెల్త్ కేర్ వర్కర్లు, పోలీస్, పారామిలటరీ దళాల సిబ్బంది,  వార్డు, విలేజి ఫంక్షనరీలు, వలంటీర్లు, ఆశా, అంగన్ వాడి వర్కర్లు, ఎఎన్ఎంలు, శానిటరీ వర్కర్లు, బ్యాంకుల సిబ్బంది, మీడియా ప్రతినిధులు కూడా ఈ యాప్ ను తప్పని సరిగా తమ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకుని వినియోగించాలని కోరారు. అలాగే  కూరగాయలు, పాలు, త్రాగునీరు, గ్రోసరీ వెండర్లు, ఇతర అత్యవసర సేవల ప్రొవైడర్లు ఈ యాప్ ను తమ యాండ్రాయిడ్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. సమూహాలుగా పనుల్లో పాల్గొనే ఉపాధి హామీ పధకం, వ్యవసాయ పనులలో పాల్గొనే కూలీలు, పరిశ్రమల కార్మికులు, వాణిజ్య సంస్థలలో పనిచేసే వారు, అత్యవసర పనులపై అనుమతించిన సమయాల్లో ఇంటి నుండి బయటికి వచ్చే ప్రతి ఒక్కరూ అరోగ్య సేతు యాప్ విధిగా తమ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకుని వినియోగించాలని కోరారు.  అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ సిబ్బంది తప్పక ఈ యాప్ వాడేలా చర్యలు చేపట్టాలని, గ్రామీణ, పట్టన ప్రాంతాల్లో ఆరోగ్య సేతు యాప్ ప్రయోజనం, వినియోగ ఆవశ్యకత అంశాలపై గ్రామా, వార్డు సెక్రటేరియట్ సిబ్బంది, వలంటీర్లు, స్వయం సహాయ సంఘాల మహిళలు, రేషన్ షాపు డీలర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి సామాజిక ఆరోగ్య భద్రత, రక్షణకు దోహదం చేసే ఆరోగ్య సేతు యాప్ ను జన బాహుళ్యంలో విస్తృతంగా వినియోగించేలా చైతన్య పరచాలని జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి కోరారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు