తూర్పుగోదావరి ;పగడ్బందీగా లాకడౌన్
తూ.గో ;;రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మే 3 వతేదీ వరకు కరోన నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఒక ప్రకటలో తెలిపారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా 144 సి.ఆర్..పి.సి. ప్రకారం నలుగురుకు మించి ఎవరు గుమ్మిగూడరాదని ఆయన తెలియజేశారు. ఈ నిబంధనలు జిల్లాలో పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని, ప్రజలు దీనికి సహకరించాలని ఆయన కోరారు. అయితే ద్విచక్రవాహనాల మీద ఒకరు మాత్రమ ప్రయాణించవల్సిఉందని, అదే నాలుగు చక్రాల వాహనాలలో ఇద్దరు కంటే ఎక్కువ మంది ప్రయాణించిరాదని, అది కూడా అత్యవసర పరిస్ధితుల్లో మాత్రమే అనుమతించబడుతుందన్నారు. వైద్యానికి సంబంధించిన మినహాయింపు ఉంటుందని ఆయన అన్నారు. ప్రతి రోజు ఉ. 10 గంటల నుండి మరుసటి రోజు ఉ. 6 గంటల వరకు ప్రజలు బయటికి రావడం నిషేధించడమైనదన్నారు. పౌరులు తమకు సంబంధించిన నిత్యవసర వస్తువులను తమ నివాసానికి 2 కి.మీ.లోపున ఉన్న దుకాణాలలో కొనుగోలు చేయాలని ఆయన కోరారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి