పోలవరం నిర్వాశితులకు పునరావాస ఏర్పాట్లు చురుగ్గా చేపట్టాలి

తూ.గో ;;పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా నిర్వాశితులకు పునారవాస కార్యక్రమాలు వేగవంతం చేసినట్లు కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి తాడేపల్లి ఆయన క్యాంపు కార్యాలయం నుండి పోలవరం ప్రాజెక్ట్ పునారవాస పనుల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి, జెసి లక్ష్మీశ, రంపచోడవరం సబ్-కలక్టర్ ప్రవీణ్ ఆదిత్య, ఇతర అధికారులతో కలిసి కాకినాడ కలక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం గోదావరి వరదల కారణంగా దేవిపట్నం మండలంలోని ఆయా గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వీరిని జూన్ మాసంలో వచ్చే గోదావరి వరదల నాటికి పునారవాసం కల్పించే విధంగా యుద్ధ ప్రాతిపదకన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన భూసేకరణ ఇప్పటికే గుర్తించడం జరిగిందని, త్వరలో గృహనిర్మాణాలు చేపట్టనున్నట్లు కలక్టర్ ముఖ్యమంత్రికి తెలిపారు. పునారవాస పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించడంలో కాంట్రాక్టర్లకు ఎటువంటి ఇబ్బందులుండవని పనులు వేగవంతం చేసి కాంట్రాక్టర్లకు సమావేశం నిర్వహించాలని పిడి హౌసింగ్ వీరేశ్వర ప్రసాద్ ఇతర ఇంజనీర్లకు, అధికారులకు కలక్టర్ సూచించారు. ( సమాచార శాఖ చే జారీ)


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు