కంటోన్మెంట్ జోన్ లల్లో బ్యాంకు సేవలు పూర్తిగా నిలిపివేత

                                                                                                                    తూర్పు గోదావరి జిల్లాలో కరోన నియంత్రణలో భాగంగా జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఉత్తర్వుల మేరకు మే 3వ తేదీ వరకు కంటోన్మెంట్ జోన్ లల్లో బ్యాంకు సేవలు పూర్తిగా నిలిపివేయడం జరిగిందని లీడ్ బ్యాంక్ మేనేజర్ జె.షణ్మఖరావు తెలిపారు. ఈ బ్యాంకుల్లో అంతర్గత సేవలు కూడా నిషేధించడం జరిగిందన్నారు. అయితే నాన్-కంటోన్మెట్ జోన్లలో బ్యాంకు పని వేళల్లో బ్యాంకులు తెరచి, బ్యాంక్ యొక్క అంతర్గత కార్యకలాపాలకు ప్రభుత్వ, ప్రభుత్వ అండర్ టేకింగ్ లావాదేవీలకు అనుమతించడం జరిగిందన్నారు. అయితే ప్రజలకు సంబంధించి బ్యాంక్ లావాదేవీలు ఉండవన్నారు. ప్రజలు ఇంటర్నెట్, ఏటియం లావాదేవీలతో పాటు ఇతర డిజిటల్ లావాదేవీలు చేసుకోవాలని సూచించారు. కరోన నియంత్రణలో భాగంగా  ఈ చర్యలు తీసుకున్నట్లు, దీనికి ప్రజలు సహకరించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ షణ్మఖరావు కోరారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు