ఘనంగా దవులూరి జన్మదిన వేడుకలు

పెద్దాపురం నియోజకవర్గం వై. యెస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి దవులూరి. దొరబాబు జన్మదినం ను పురస్కరించుకొని శుక్రవారం నియోజక వర్గంలో పార్టీ నాయకులు,కార్య కర్తలు అంగరంగ వైభవంగా జన్మ దిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భముగా   వైస్సార్సీపీ  నాయకుడు, 6వ వార్డ్ మాజీ కౌన్సిలర్ ఉబా జాన్ మోసెస్  ఆధ్వర్యంలో సుమారు 300 మంది వార్డ్ ప్రజలు డప్పు వాయిద్యా లతో ఊరేగింపు గా మోసెస్  నాయకత్వం లో గజమాలతో ఊరేగింపు గా దొరబాబు ఇంటికి వెళ్లి 10 కేజీ ల కేక్ కట్ చేయించి, గజమాలతో దొరబాబు ని సత్కరించారు.అంతే కాకుండా నియోజక వర్గంలోని నాయకులు,కార్య కర్తలు దొరబాబుకు పూల మాలలు,బొకేలతో శుభాకాంక్షలు తెలిపి దుశ్శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో మాజీ వైస్ చైర్మన్ గోలి దొరబాబు,ఎలిశెట్టి నరేష్, సల్లూరి.కళ్యాణ్,పాగా సురేష్, మగాపుగోపి,కరణం భాను, వార్డ్ సభ్యులు,నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు