ఎపి సర్కార్ ; జిల్లాకు ముగ్గురు జాయింట్ కలెక్టర్లు
జిల్లాకు ముగ్గురు జేసీ లు
====================
*రాష్ట్ర పాలనా యంత్రాంగంలో మార్పులు*
*ఇకపై జిల్లాకు ముగ్గురు జాయింట్ కలెక్టర్లు*
*నేడో, రేపో ఉత్తర్వులు*
*గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు పలు సంక్షేమ పథకాల పర్యవేక్షణ బాధ్యత కొత్త జేసీకి
*సీనియర్ టైమ్ స్కేలు ఉన్న ఐఏఎస్ అధికారి నియామకం*
*ముగ్గురికీ పని విభజనలో సర్కారు స్పష్టత
*మొత్తంగా జిల్లా కలెక్టర్‌కు వీరు పాలనలో సహకారం అందిస్తారు
*మార్పులు ఇలా*
====================
1.జాయింట్ కలెక్టర్–1ను ఇక మీదట జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా మరియు రెవెన్యూ)గా పునర్యవస్థీకరించనున్నారు. వీరిని జేసీ–ఆర్‌బీ అండ్ ఆర్‌గా పిలుస్తారు. వీరు రైతు భరోసా మొదలు వ్యవసాయం, అనుబంధ రంగాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇసుక, గనులు, ఎక్సైజ్, శాంతిభద్రతలు తదితర విభాగాలకూ బాధ్యత వహించాలి. రెవెన్యూ విభాగం, సబ్ కలెక్టర్లనూ పర్యవేక్షించాలి.
2.‘జాయింట్ కలెక్టర్–విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియట్’ అని కొత్త పోస్టు సృష్టించనున్నారు. వీరిని జేసీ–వీ అండ్ డబ్ల్యూఎస్‌గా పిలుస్తారు. ఈ పోస్టులో సీనియర్ టైమ్ స్కేలు ఉన్న ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణతో పాటు పలు సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తారు.
3. ఇప్పుడున్న జాయింట్ కలెక్టర్–2ను జాయింట్ కలెక్టర్–హెల్త్ అండ్ ఎడ్యుకేషన్‌గా పునర్యవస్థీకరించనున్నారు. ఇది నాన్–క్యాడర్ పోస్టు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఎస్‌సీఎస్/నాన్–ఎస్‌సీఎస్ కేడర్‌ను ఈ పోస్టులో నియమిస్తారు.వీరు జిల్లాలో వైద్య, ఆరోగ్య విభాగం, విద్యా శాఖను పర్యవేక్షిస్తారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, దిశ చట్టం అమలు బాధ్యతలు చూడనున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి