<no title>
తూ . గో ;జిల్లాలో ఉన్న ఆక్వా పరిశ్రమలలో పనికి వెళ్లే కార్మికులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధ్యక్షతన ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 11 ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ లు ఉన్నాయన్నారు. ఈరోజు తాళ్లరేవులో ఉన్న ఆ
క్వా ప్రాసెసింగ్ ప్లాంట్ క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగిందని, అక్కడ కరీనా నివారణకు కార్మికులకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. వివిధ గ్రామ స్థాయిల్లో కొంతమంది వ్యక్తులు అపోహలు సృష్టించి కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారన్నారు.ఎవరైనా స్వచ్ఛందంగా ఆక్వా ప్లాంట్ లలో పనికి వెళ్లే కార్మికులకు ఆటంకాలు కలిగిస్తే అటువంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ లకు ఎక్కువ కార్మికులు పనికి హాజరయ్యే విధంగా చూడాలని వివిధ ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ ల ప్రతినిధులకు కలెక్టర్ సూచించారు. ప్రాసెసింగ్ ప్లాంట్ ల దినసరి సామర్ధ్యాన్ని పెంచాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో మత్సశాఖ అదనపు సంచాలకులు పి.కోటేశ్వరరావు,జెడి పి.జయరావు, వీరభద్ర ఎక్స్ పోర్ట్ ,దేవి ఫిషరీస్,దేవి ఆక్వాటెక్,కోస్టల్ ఆక్వా,ఎఫెక్స్ ప్రోజెన్ ల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి