హోమ్ గార్డులకు నిత్యావసర వస్తువులు పంపిణి

ముమ్మిడివరం.(తూ.గో); యావత్ ప్రపంచం గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలన నేపథ్యంలో ప్రధానమైన సేవలందిస్తున్న ప్రాణాల్ని పణంగా పెట్టి ఇస్తున్నా, మీరు ఇంట్లో ఉండండి.. మేము బయట కాపలా కాస్తాయి అంటూ ప్రజలు బాగోగులు చూస్తున్న పోలీసులను అభినందిస్తూ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం వర్గం లో పనిచేస్తున్న హోంగార్డులు చేస్తున్న సేవలును గుర్తించిన ముమ్మిడివరం వార్తక సంఘాలు వారు సుమారు 38 మంది హోం గార్డ్ కుటుంబాల వారికి 25 కేజీల బియ్యం, పామాయిల్, కందిపప్పు, పంచదార, మినప్పప్పు నిత్యవసర వస్తువులను అమలాపురం డి.ఎస్.పి. మసుంబాషా చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ హోంగార్డులు విధి నిర్వహణ ఎంతో చాకచక్యంగా చేస్తున్నారని ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ మా స్కూల్ ధరించి, చేతికి గ్లౌజులు వేసుకుని విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజల పట్ల గౌరవ మర్యాదలతో మెలగాలని తెలిపారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు