దాతలూ ...ఏదీ ... దూరం ,ఆదమరిస్తే ముప్పు తప్పదు ;;సేవలు దూరం నుండి చేయండి ''';;అమలాపురం డిఎస్పీ బాషా

ముమ్మిడివరం,తూ.గో;; కరోనా వైరస్ లాక్ డోన్ సందర్భంగా చాలా మంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి భోజన సదుపాయాలు కల్పించడం, నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం అభినందనీయం అని కానీ ఆయా సందర్భాల్లో అతి ముఖ్యముగా సామాజిక దూరం పాటించకుండా చేయడం వల్ల వైరస్ వ్యాప్తి నిరోధించ వలసింది పోయి వ్యాపింప చేసిన వాళ్ళం అవుతావని అమలాపురం డి.ఎస్.పి. మాసూం భాష అన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ మనమందరం దేనికోసం ప్రేమిస్తున్నామో మొత్తం ఆ స్పూర్తి దెబ్బ తినే ప్రమాదం ఉందని దయచేసి ప్రజలందరూ ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చెయ్యి తలుచుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై, లేదా సి ఐ నీ కలసి అనుమతి తీసుకోవాలని కోరారు. మున్సిపల్, కార్పొరేషన్ల పరిధిలో ఎవరైనా దాతలు ఇటువంటి కార్యక్రమాలు చేయదలుచుకుంటే కమిషనర్లు దగ్గర వారి పేర్లు నమోదు చేసుకుంటే సామాజిక దూరం పాటిస్తూ వాటిని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘించిన ఎడల స్థానిక పోలీసు లు అనుమతి లేకుండా గుంపులు గుంపులుగా తిరుగుతూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అమలాపురం డి.ఎస్.పి. షేక్ మాసూం భాష ఒక ప్రకటనలో తెలిపారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు