ధాన్యం ;రవాణాలో లారీ యజమానులు చార్జీలు పెంచకుండా చూడాలి
జిల్లాలో రైతులు పండించిన ధాన్యం రవాణాలో లారీ యజమానులు రవాణా ఛార్జీలు పెంచకుండా చూడాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
తూ.గో ;;గురువారం కలెక్టర్ కార్యాలయంలో జెసి తన కార్యాలయంలో ధాన్యం రవాణాలో లారీల లభ్యతపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జెసి జి. లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలింపులో లారీల కొరత లేకుండా చూడాలని అన్నారు.అదేవిధంగా రవాణా ఛార్జీలు ఎక్కువ వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత కరోనా లాక్ డౌన్ కారణంగా టోల్ ఛార్జీలు వసూలు చేయడం లేదు కాబట్టి లారీ యజమానులు అధిక రవాణా ఛార్జీలు వసూలు చేయకుండా నియంత్రించాలన్నారు.జిల్లాలో రేపటి నుండి ప్రారంభమవుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కావాల్సిన ధాన్యం తేమ కొలిచే యంత్రం, టార్పాలిన్,తదితర సామగ్రిని సమకూర్చుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రాలలో రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం మన రాష్ట్రానికి రాకుండా నిరోధించడానికి చింతూరు,ఇతర అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ల వద్ద నిఘా పెంచే విధంగా ఎటపాక రెవెన్యూ డివిజనల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో నిత్యవసర సరకులు,కూరగాయలు,పండ్లు తగినంత నిల్వలో ఉన్నాయని తెలిపారు.వీటి రవాణాలో ఎటువంటి ఆంక్షలు లేవని,ధరలు ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయని జెసి తెలిపారు.ఈ సమావేశంలో డిఎం సివిల్ సప్లై ఇఎన్ జయరావులు,డిటివో ప్రతాప్,డిఎస్ ఓ ప్రసాద్ బాబు, ఎడి మార్కెటింగ్ కెవిఆర్ఎన్ కిషోర్,వ్యవసాయ శాఖ డిడి వి.టి.రామారావు, డిఎస్ ఓ పాండు రంగారావు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి