ఆక్వా రైతుల,హేచరీ యాజమాన్యాల వారి కొరకు చర్యలు ;;మత్యశాఖ

తూ.గో ;; COVID - 19 మూలంగా Lock down విధించిన ప్రారంభంలో ఆక్వా రంగంలో చాలా సమస్యలు ప్రభుత్వం దృష్టికి రావడం జరిగిందని మత్యశాఖ  కాకినాడ సంయుక్త్ చంచలకులు పి . జయరాజ్ తెలిపారు. అందులో భాగంగా, జిల్లా కలెక్టరు  జిల్లాలోని మంత్రులు సమక్షములో ఆక్వా రైతులు, హెచరీ యాజమాన్యం, మేతల కంపెనీల యాజమాన్యం, ప్రాసెసింగ్ ప్లాంట్ల యాజమాన్యంలతో మరియు జిల్లా ఇంచార్జి మంత్రి మరియు మత్స్యశాఖ మంత్రి వర్యుల అధ్వర్యంలో సమావేశములు నిర్వహించి, వారి సూచనల తీసుకోవడం జరిగిందని తెలిపారు . అంతేకాకుండా  ప్రభుత్వ ఆదేశాల మేరకు సమయానుకులంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుచున్నది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఆక్వా రంగమునకు సంభందించిన సీడు, ఫీడు రవాణాకు త్వరితగతిన వాహనములకు అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటివరకు 248 అనుమతులు మంజూరు చేయడమైనది. అదేవిధంగా యునిట్లలో పనిచేసే సిబ్బందికి, వర్కర్ల రవాణా నిమిత్తము 116 బస్సులకు మరియు 3500 మంది పనివారు లకు అనుమతులు మంజూరు చేయడమైనది. ఆక్వా యునిట్లలో పనిచేసే పనివారు ప్రారంభంలో హాజరు కానీ కారణంగా ఆయా గ్రామాలలో అధికారులు CORONA Virus వ్యాప్తి చెందకుండా ఉండుటకు తీసుకోవలసిన జాగ్రత్తల పై అవగాహన కల్పించి, వారికి అదనపు వేతనంగా 50% పెంచుట ద్వారా వర్కర్లు 1600 నుండి ఈనాటికి 4500 వరకు పెరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగినది. మధ్యవర్తులు, దళారీలు రొయ్యల రేట్లు * ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తగ్గించి తక్కువ ధరలకు కొనుచున్న సంధర్బంలలో అన్ని ప్లాంట్ల వద్ద మత్స్యశాఖ అభివృద్ధి అధికారి స్థాయి గల అధికారులను నియమించి వారి కొనుగోళ్లను పర్యవేక్షించుటతో పాటు, జిల్లాలోని ఆక్వా రైతుల యొక్క అభ్యర్ధన మేరకు నేరుగా ప్రాసెసింగ్ ప్లాంట్ల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు కొనుగోలు చేయుటకు తగు చర్యలు తీసుకొనబడుచున్నది.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు