ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం(తెలంగాణ) ; భద్రాద్రి కొత్తగూడెం కరోనా కారణంగా అనేక రకాలుగా ఇబ్బందిపడుతున్న నిరుపేదలైన ఆటో డ్రైవర్లకు శనివారం కొత్తగూడెం శేషగిరి భవన్ లో మాజీ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా చేతుల మీదుగా ఏ ఐ టి యు సి ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది పేదలైన ఆటోడ్రైవర్ల కు గవర్నమెంట్ ఆర్థిక సాయం చెయ్యాలని కూనంనేని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య గారు జిల్లా కార్యదర్శి కనకం సూరిబాబు సహాయ కార్యదర్శి వేల్పుల భాస్కర్ బత్తుల సత్యనారాయణ దేవరపల్లి రాజేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు....
.....................................
సుజాతనగర్ మండల కేంద్రంలోని మంగపేట గ్రామపంచాయతీలో శనివారం గుగులోతు రమేష్ అధ్యక్షతన సుమారు 70 కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొత్తగూడెం జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ కోనేరు సత్యనారాయణ (చిన్ని) గ మరియు సుజాతనగర్ బిజెపి మండల అధ్యక్షుడు భూక్య రాజేష్ గుగులోత్ రమేష్ ఖాసీం ప్రసాద్ వెంకటేష్ తదితరులు పాల్గొని నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది.
...........................................................
జూలూరుపాడ్ హైస్కూల్ 1988వ సంవత్సరం పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల
ఆధ్వర్యంలో రెండవ రోజు వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ
జూలూరుపాడ్ మండలం లోని వినోభనగర్ గ్రామంలో వలస కూలీలకు జూలూరుపాడ్ హైస్కూల్ లో 1988 సంవత్సరం పదవ తరగతి చదివని విద్యార్థులు వారి ప్రాంతాల్లో పలు రకాల వృత్తి రీత్యా నివసిస్తూ కూడా తాము చదువుకున్న మండలంలో సహాయం చేయడానికి ముందుకు వచ్చిన మిత్రుల సహకారంతో మోదుగు ప్రభాకర్ అన్నవరపు సత్యనారాయణ పెండ్యాల మురళి నున్న గోపాలరావు ఆధ్వర్యంలో 60 కుటుంబాలకు శనివారం నిత్యావసర సరుకులను మండల ప్రత్యేక అధికారి సుధాకర్ రెవెన్యూ తహశీల్దార్ విజయకుమార్ ఎంపిడివో దేవకరణ ఎస్సై శ్రీకాంత్ లు పనులు లేక ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలకు నిత్యావసర సరుకులను అందించారు మండలం లో చదువుకున్న మిత్రులు కరోన వైరస్ వ్యాప్తి ని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం వలన ఇతర రాష్ట్రాల నుండి జూలూరుపాడ్ మండలానికి వ్యవసాయ పనుల నిమిత్తం మిర్చి కోతకు వచ్చి ఇక్కడ చిక్కుకు పోయిన కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణి కి ముందుకు వచ్చినందుకు పలువురు అభినందించారు ఈ లాంటి సేవ కార్యక్రమలు మరికొందరికి స్ఫూర్తి కలిగించేవిదంగా ఉందని అన్నారు
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టడానికి నియంత్రించడానికి దేశ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో రాష్ట్రంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఎక్కడి ప్రజలు అక్కడ ఇంటికి పరిమితం అయిపోయారు. పేదవారికి జీవన విధానం కష్టమైపోయింది ఈ తరుణంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మరియు జిల్లా తెరాస నాయకులు వనమా రాఘవేంద్రరావు ఆదేశాల మేరకు తన వంతు సహాయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుడిద్ద గడ్డ బస్తి కు చెందిన తెరాస నాయకులు ఎండీ యాకూబ్ గారూ మొహమ్మద్ దస్తగిర్ షకీల్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా తమ సేవాభావం చాటుకొన్నారు. బుడిద్ద గడ్డ బస్తి 1వ వార్డ్ 2వ వార్డ్ కు చెందిన 200 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు మరియు 6రకాల కూరగాయలు మరియు కుటుంబానికి 6కోడి గుడ్లు పంపిణీ చేయడం జరిగింది దీనితో పేదవారు సంతోషం వ్యక్తం చేశారు. తెరాస నాయకులు ఎండీ యాకూబ్ మాట్లాడుతూ నిను పేదలకు నిత్యవుసర వస్తువులు కూరగాయలు కోడిగుడ్లు పంచడంలో చాల సంతృప్తి చెందుతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో 1వ వార్డ్ సిపిఐ కావున్సలార్ బోయిన విజయ్ కుమార్ స్పెషల్ ఆపీసర్ మరియు తెరాస మాజీ కాన్సలార్ తాండ్ర శ్రీనివాస్ ఎండీ యాకూబ్ పాషా సుధాకర్ గాంధీ బాబురావు వరుస లక్ష్మణ్ రగు పి రాజ్ కుమార్ తెరాస బుడిద్ద గడ్డ బస్తి యూత్ రూపేష్ షాహిద్ సోను రియాజ్ ఆరిఫ్ అన్వర్ మునీర్ గావుస్ షాకీర్ ఖాదిర్ ఫయాజ్ జావేద్ జలల్ పాల్గొన్నారు ఈ కార్యక్రమనీ నిర్వహించిన బూడిది గడ్డ తెరాస నాయకుడు ఎండీ. యాకూబ్ వనమా యువసేన తరుపున అభినందించారు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు వారి స్టాప్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ కారణంగా ఇంటి వద్దనే ఉంటున్న విలేకరులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ తరుణంలో మండల విలేకరులకు స్కూల్ హెడ్మాస్టర్ మెరుగు శ్రీనివాస్ మరి కొంతమంది టీచర్లు కలిసి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది ఈ తరుణంలో విలేకర్ల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడం వారికి ఎంతో సంతోషకరంగా ఉందని విలేకరులు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో లో మండల విలేకరులు పాల్గొన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి