రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు చర్యలు
తూ.గో '';ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద రైతులకు గిట్టు బాటు ధర అందించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని జాయింట్ కలక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం పిఠాపురం మండలం ఎఫ్. కె. పాలెం గ్రామంలో ధాన్యం రైతులను కలిసికొని కొనుగోలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 271 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. చేతికి వచ్చిన వరిపంటను కోసుకునే విధంగా కోత యంత్రాలు కూడా సిద్ధం చేసామన్నారు. ధాన్యం కొనుగోలు లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులకు జెసి పలుసూచనలు చేసారు. అదే విధంగా కోవిడ్ - 19 భాగంగా నిత్యవసర వస్తువుల సరఫరా ధరలు నియంత్రణ లుండే విధంగా పరిశీలించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జెసి కాకినాడ రూరల్ మండలం లోని చౌకధర దుకణాలు, పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో చౌకధర దుకణాలను ఆకస్మికంగా తనిఖీ చేసారు. అదే విధంగా రామచంద్రపురం డివిజన్ లోని రైతు బజార్లను తనిఖీ చేసారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో నవరత్నాలు పేదలకు ఇల్లు లో భాగంగా స్థలాలను పరిశీలన చేసారు. ఈ పర్యటనలో జెసితో పాటు పిఠాపురం శాసనసభ్యులు పెండెం దొరబాటు, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి