నాడు -నేడు పనులు వేగవంతం చేయండి

తూ.గో ;;జిల్లాలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్-2 జి.రాజకుమారి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నందు నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పనులపై జేసీ-2 సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి-2 జి.రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఆర్గాజిఎస్ నిధులతో ప్రతి గ్రామంలో సచివాలయం భవనంతో పాటు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, వైయస్సార్ రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం ఆదేశాల ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో 1,270 గ్రామ సచివాలయాలకు గాను మైదాన ప్రాంతంలో రూ.40 లక్షలు, ఏజెన్సీ ప్రాంతంలో రూ.42 లక్షలతో నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మనబడి నాడు-నేడు కార్యక్రమం కింద జిల్లాలో 1,482 పాఠశాలలు ఎంపిక చేయగా 1,180 పాఠశాలలో టాయిలెట్స్ అవసరమని అన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా చేపట్టిన పనులపై పురోగతి చూపెట్టాలని జెసి-2 తెలిపారు. ఈ సమావేశంలో డ్వామా పిడి శ్యామల, డిఈఓ ఎస్.అబ్రహం, ఎస్ఎస్ఏ పీవో విజయ్ భాస్కర్, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ నాగరాజు, తదితరు


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు