రంజాన్ ;ముస్లింలు రంజాన్ లో నిబంధనలు పాటించాలి;; కలెక్టర్ ఎంవి

                                                                                                    టి.ఎస్ (కొత్తగూడెం) ;కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాధి నివారణకు పూర్తి లాక్డౌన్ పాటిస్తున్నందున  అన్ని మత ప్రదేశాలు, ప్రార్థనా స్థలాలు  మూసివేసినట్లు జిల్లా కలెక్టర్ డా ఎంవి రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తి చెందడం వలన నిషేధించబడ్డాయని చెప్పారు.  ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం  ముస్లింలు అత్యంత ఆశీర్వదించిన నెలగా భావిస్తారని  రంజాన్ మాసం ఏప్రిల్ 24 లేదా 25 నుండి  ప్రారంభం కానున్నందున  దీనికి సంబంధించి, జామియా నిజామియా పలు సూచనలు  విడుదల చేసినట్లు చెప్పారు. సమాజానికి మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ప్రార్థనలు నిలివేసిన  నేపథ్యంలో పవిత్ర రంజాన్ మాసంలో తరువాతి నెలల్లో ముస్లింలు ఇళ్ళ వద్ద  ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.  ముస్లింలందరూ ఇంట్లో ఇఫ్తార్ విందులో  పాల్గొంటారని,  ఇఫ్తార్ కోసం మసీదులకు వెళ్లడం మరియు ఆతిథ్యం ఇవ్వడం లేదా ఇఫ్తార్ పార్టీలు చేయకూడదని చెప్పారు.  పేదలకు ఆదా చేసిన డబ్బును ఇవ్వడానికి  ప్రభుత్వం ఇచ్చిన సూచనలతో పాటు సలహాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యం మరియు వైద్య నిపుణులు మరియు నివారణ చర్యల ప్రకారం  ముఖ్యంగా సామాజిక దూరం పాటించాలని చెప్పారు. ఎటువంటి మినహాయింపు లేదని ప్రభుత్వ ఉత్తర్వులను తు.చ పాటించాలని ముస్లింలకు కలెక్టర్ సూచించారు.  అతిక్రమిస్తే వ్యాధి నియంత్రణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు