కరోనా ;; లక్షణాలుంటే భయం వద్దు ... స్వచ్ఛందం గా ముందుకు రండి

తూ.గో ];జిల్లాలో కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు కలిగిన వ్యక్తులు ఎటువంటి భయం, సంకోచం, గోప్యత లేకుండా వైద్య పరీక్షలు చేయించుకునేందుకు స్వచ్చందంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా కలెక్టర్ డి.మురళీధర రెడ్డి, వివిధ శాఖల కోవిడ్ 19 నియంత్రణ అధికారులతో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించి కరోనా వైరస్ నియంత్రణకు, లాక్ డౌన్ అమలుకు జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను వివరించి ప్రజా సహకారాన్ని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పటిష్టమైన వైరస్ నిరోధ కార్యాచరణ ద్వారా జిల్లాలో పాజిటీవ్ కేస్లను నిన్నటి వరకూ 11 కేసులకు నియంత్రించ గలిగామని, గురువారం కత్తిపూడిలో మరో పాజిటీవ్ కేస్ గుర్తించడంతో ఈ సంఖ్య 12కు చేరిందన్నారు. పాయకరావు పేటకు చెందిన వ్యక్తి ఉగాది పండుగకు కత్తిపూడి రావడం జరిగిందని, కరోనా వైరస్ లక్షణాలతో కూడిన జ్వరం సోకినా, సదరు సమాచారాన్ని గుప్తంగా ఉంచి ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న అతని గురించి సమాచారం తెలిసిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటీవ్ అని తేలిందన్నారు. అతని ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉండటం వల్ల ప్రత్యేక చికిత్స కొరకు వైజాగ్ పంపించామని, అతని కుటుంబ సభ్యులందరినీ ఐసోలేషన్ లో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అతడు, కుటుంబ సభ్యులు వైరస్ లక్షణాలు ఉన్నా గోప్యత పాటించడం వల్ల అతని ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారిందని, సమాచారం దాచి నందుకు వారి పైన, ప్రయివేట్ ఆసుపత్రి, లాబొరేటరీల పైన చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. కరోనా వైరస్ లక్షణాలుగా అనుమానం ఉన్న వ్యక్తులు అందరూ ఎటువంటి భయం, సందేహం లేకుండా వైద్య ఆధికారులు, సిబ్బందికి వెంటనే తెలియజేసేందుకు స్వచ్చందంగా ముందుకు రావాలని, సమాచారం దాచి పెట్టి తమకు, కుటుంబానికి, తోటి ప్రజలకు ముప్పు తేవద్దని జిల్లా కలెక్టర్ ఈ సందర్బంగా కోరారు. అలాగే కరోనా వైరస్ సంక్రమిత లక్షణాలు కలిగిన కేసులను ప్రయివేట్ ఆసుపత్రులలో చేర్చుకోవద్దని ఇప్పటికే కచ్చితమైన ఆదేశాలు జారీ చేసామని, వీటిని అతిక్రమించే వారి పై కఠిన చర్యలు చేపడతామన్నారు. అలాగే ఆర్ ఎంపి లు అందరూ తమ ప్రాక్టీస్ నిలిపివేయాలని, కోవిడ్ 19 అనుమానిత వ్యక్తుల సమాచారం తెలిస్తే ప్రభుత్వ వైద్య ఆధి కారులకు తెలిజేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ, చికిత్సలలో అత్యవసరమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్స్ తయారీ ప్రక్రియ స్థానికంగా కెఎస్ఈజడ్ లోని బొమ్మల తయారీ యూనిట్లో ప్రారంభ మైందని, నూరు శాతం స్టెరిలైజ్డ్ మెటీరియల్ లో వైద్య, రక్షణ ప్రమాణాల కనుగుణంగా రూపొందించిన ఈ కిట్లను జిల్లాతో పాటు, రాష్ట్రంలో కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య , పాజిటీవ్ కేసులకు చికిత్స చేస్తున్న వైద్య బృందాలకు పంపిణీ చేస్తామన్నారు. తొలి బాచ్ 50 కిట్లను ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది పంపిణీ చేసేందుకు జిల్లా ఎపికి ఆయన అందజేశారు. అలాగే పారిశుద్య కార్మికులకు రియూజబుల్ పిపిఈ కిట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జిల్లా ఎస్ పి అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ కరోనా వైరస్ సక్రమణ లక్షణాలను దాచి పట్టి సమాజానికి ఆరోగ్య పరమైన ముప్పు కలిగించే వారి పై సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు గైకొంటామని తెలిపారు. అలాగే లాక్ డౌన్ కచ్చితంగా అమలు చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ప్రజలకు నిత్యావసర సరకుల సరఫరాకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టామని, నిత్యావసరాలు, మందులు, మాంసం, చేపలు డోర్ డెలివరీ పొందే ఏర్పాటు చేసామన్నారు. రైతుల రబీ ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 271 పిపిసి కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. వేరే రాష్ట్రాల నుండి వచ్చే ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వం నిషేధం విధించినందున మన రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందని, రైతులు ఎవరూ తక్కవ ధరకు అమ్మి నష్ట పోవద్దని కోరారు. . జిల్లాలో కోవిడ్-19 నియంత్రణకు కరోనా ప్రత్యేక ఆసుపత్రులను రాజనగరం జియల్ ఆసుపత్రి, రాజమండ్రి జిల్లా ఆసుపత్రి, అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలలో ఏర్పాటు చేసామని, మరో కాకినాడ, రాజమండ్రిలలో మరో 3 మూడు ఆసుపత్రులలో కరోనా సంసిద్ధతా ఏర్పాట్లు చేపట్టామని, కరోనా హాస్పిటల్స్ ప్రిపేర్ నెస్ ప్రత్యేక అధికారి, ఐటిడిఏ పిఓ నిషాంత్ కుమార్ తెలిపారు. ఖాళీగా ఉన్న వైద్యలు, సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి జారీ చేసిందని, ఈ మేరకు జిల్లాలో ఉన్న ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతి పై నింపేందుకు చర్యలు చేపట్టామన్నారు. . అలాగే జాయింట్ కలెక్టర్-2 జి.రాజకుమారి కరోనా సర్వైవ లెన్స్ క్రింద చేపట్టిన కార్యచరణను, సహాయ, పునరావాస చర్యలను డిఆర్ ఓ సిహెచ్.సత్తిబాబు వివరించారు. సమావేశంలో తమ వంతు పూర్తి సహాయ సహాకారలను అందిస్తామని ప్రయివేట్ వైద్యుల తరపున ఐఎంఏ ప్రతినిధులు డా. వాడ్రేవు రవి, డా.ఆనంద్, ఆర్ఎంపి ల తరపున వారి ప్రతినిధి ఎస్.రామ్ తెలియజేశారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు