గిరి జనులకు ans పార్టీ నిత్యావసర వస్తువులుపంపిణి

తూర్పు గోదావరి;; తూర్పు గోదావరి జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్ పి.  అద్నాన్ నయం అస్మి  చేతుల మీదుగా తూర్పు గోదావరి జిల్లా ఏఎన్ఎస్ పార్టీకి చెందిన అధికారులు మరియు సిబ్బంది సహకారంతో బియ్యం, కిరాణా మరియు కూరగాయలు తో కూడిన 200 ప్యాకెట్లను తయారుచేసి, ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి గ్రామములో గల గిరిజనలకు పంపిణీ చేయు నిమిత్తం జిల్లా కలెక్టర్  కంట్రోల్ రూమ్ ద్వారా పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ, ఎంతో విపత్కర పరిస్థితులలో విధులు నిర్వహిస్తూ మానవతా దృక్పథంతో స్పందించి సహాయం చేయడం చాలా గొప్ప నిర్ణయం అని  ఏఎన్ఎస్ పార్టీ అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ పి.  అద్నాన్ నయం అస్మితో పాటు ఓఎస్డి ఆరిఫ్ హఫీజ్, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్ )కె.కుమార్ఎసిబి డిఎస్బిలు యం అంబికా ప్రసాద్, ఎస్.ఎస్ మురళీమోహన్, ఎసిబి సిఐ ఎస్ రాంబాబు , ఆర్ ఐ ఏఎన్ఎస్ బి.రామకృష్ణ  తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు