*వాలంటీర్ ఉచితంగా గా కాయగూరల పంపిణీ:*





కాకినాడ రూరల్ ; తూరంగి, సత్య దుర్గ నగర్ లో తనకు కేటాయించిన 50 ఇళ్లకు 10 వేల రూపాయల విలువ చేసే కాయగూరలను బుదవారం ఉచితంగా పంపిణీ చేసిన వాలంటరీ  విత్తనాల వేదీష్. ఈ సందర్భంగా వేదీష్ మాట్లాడుతూ, లాక్ డౌన్ సందర్భంగా రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళకు పనులు లేకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా ఉం డ టాన్ని చూసి నాకు ఈ ఆలోచన వచ్చిందన్నడు. నా స్తోమతకు తగ్గట్టు వాలంటీర్ గా వచ్చిన పారితోషకం రెండు నెలలది, పదివేల రూపాయలతో సరుకులను ఇస్తున్నానని తెలియజేశారు. ఇదేవిధంగా దాతలు ముందుకు వచ్చి రోజువారి కూలి పనులకు వెళ్లే పేదవారికి పనులు లేవు కాబట్టి సహాయం చేయడం వలన వారు బయటకు రాకుండా ఉంటారని, తద్వారా కరోణ వైరస్ ప్రబలకుండా ఉంటుందని ఆశాభావం వ్యక్తపరిచారు. వయసుతో నిమిత్తం లేకుండా ఇంతటి మంచి పనిని చేపట్టిన వేదీష్ ని గ్రామ పెద్దలు, పంచాయతీ కార్యదర్శి జొన్నాడ నరసింహారావు అభినందించారు.

 

 




 

Attachments area

 


 



 



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు