కరోనాపై యుద్ధంలో మీరూ సైనికులు కావొచ్చు..YS Jagan పిలుపు..

YSRCP ప్రభుత్వం హెల్త్ వలంటీర్ల కోసం పిలుపునిచ్చింది. వివిధ విభాగాలకు సంబంధించి స్వచ్ఛంగా పని చేసేందుకు వలంటీర్లు ముందుకు రావాలని కోరింది.






 





                    ఏపీలో కరోనా  (కోవిద్ 29) మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కరోనాపై యుద్ధంలో ప్రజలను స్వచ్ఛందంగా భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫుల్ టైమ్, పార్ట్ టైమ్‌గా పని చేసే వలంటీర్ల కోసం ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను సైతం సిద్ధం చేసింది. ‘‘రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌పై చేస్తున్న యుద్ధంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలనుకుంటున్నారా ? అయితే https://health.ap.gov.in/CVPASSAPP/Covid/VolunteerJobs లో రిజిస్టర్ చేస్కోండి’’ అని ప్రకటన ఇచ్చింది.


 

                                                                                                    ఇందులో డాక్టర్లు (జనరల్, స్పెషలైజేషన్), పారామెడిక్, స్టాఫ్ నర్స్, ఆస్పత్రిలో వలంటీర్, క్వారంటైన్ వద్ద వలంటీర్లు కావాలని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. మీరు చేసే ఈ బాధ్యతాయుతమైన పని వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడతాయని తెలిపింది.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు