ఇంగ్లీషు మాధ్యమం పరిరక్షణకై సుప్రీంకోర్టుకు వెళతాం-YK


   అమరావతి ;; ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాద్యమాన్ని ప్రవేశ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం జారీ చేసిన G.O.M.S.Nos: 81, 85 లను హైకోర్టు రద్దు చేసిన దృష్ట్యా, బడుగు-బలహీన వర్గాల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసమై ఈ తీర్పు పైన అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో "రివిజన్ పిటిషన్" దాఖలు చేస్తామని ప్రముఖ న్యాయవాది,సెంటర్ ఫర్  సోషల్ జస్టిస్  రాష్ట్ర కన్వీనర్ వై.కోటేశ్వరరావు అన్నారు . రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించి ఇంగ్లీష్ మాద్యమాన్ని పరిరక్షించాలని కోరుతున్నామన్నారు
     ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఒకటవ తరగతి  నుండి పూర్తిగా ఇంగ్లీషు మాధ్యమాన్నే అమలు జరుపుతున్నారు.  ఒక పాఠ్యాంశంగా కూడా తెలుగును బోధించకుండా, సంస్కృతాన్ని ప్రవేశపెట్టారు. ఇట్టి పరిస్థితుల్లో అణచబడ్డ కులాలకు చెందిన విద్యార్థులు ఇంగ్లీష్ భాషలో వెనుకబడి పోయినందు వలన అన్ని జీవన రంగాలలోను పోటీలో వెనుకబడి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని పూడ్చడానికై ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశ పెట్టిన ఆ జీవోలు తోడ్పడతాయి. ఒకవైపున ప్రైవేటు విద్యాసంస్థలు ఇంగ్లీషు మీడియంగానే కొనసాగుతుండగా,  ఆ వాస్తవాన్ని పరిగణనలోనికి తీసుకునైనా ఆ జీవోలను అమలుకు హైకోర్టు అనుమతి ఇచ్చి ఉండవలసింది.  ఒకే విధమైన విద్యావిధానం అటు ప్రైవేటు విద్యాసంస్థల్లో గానీ, ఇటు ప్రభుత్వ విద్యాసంస్థలలో గానీ ఉండవలసిన అవసరం రీత్యా కుాడా ఈ జీవోలను హైకోర్టు  సమర్థించ ఉండవలసింది.  ఆంధ్రప్రదేశ్  హైకోర్టు వెలిబుచ్చిన తీర్పు బడుగు- బలహీన వర్గాలకి చాలా నష్టం కలగజేస్తుంది.కనుక, ఈ వర్గాల పక్షాన సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్  వేసి ఇంగ్లీషు మాధ్యమాన్ని పరిరక్షించేందుకు న్యాయ పోరాటం చేస్తాం. హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు వేసిన బహుజన టీచర్స్  అసోసియేషన్ సంస్థ తరపు న్యాయవాదిగా సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ వేయవలసిందిగా ఆ సంస్థకి కూడా సలహా ఇస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతగా సుప్రీం కోర్టుకు వెళ్లి ఇంగ్లీషు మాధ్యమాన్ని పరిరక్షించవలసిందిగా కోరుచున్నామన్నారు  


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు