నాయకర్ స్పూర్తితో నిరుపేదలకు నిత్యవసర వస్తులు పంపిణీ
తూ.గో ;; కాకినాడ స్థానిక జగన్నాధపురం యం.యస్.యన్. చారిటీసు ఎయిడెడ్ ఉన్నత పాఠశాల సిబ్బంది మరియు పూర్వ విద్యార్ధుల సహకారంతో నిరుపేదలకు నిత్యవసర వస్తులు పంపిణీ కార్యక్రమం సోమవారం యం.యస్.యన్. చారిటీసు నందు నిర్వహించారు. కరోనా నివారణ లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందిపడుతుంది 280 మంది నిరుపేదలకు నిత్యవసర వస్తులు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా యం.యస్.యన్. చారిటీసు ఛైర్మన్ మల్లాడి శివరామ నాయకర్ మాట్లాడుతూ మహాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ స్ఫూర్తితో నిరుపేదలకు సహాయం అందించామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సమయంలో పేదలకు సహాయం చేయలని పిలుపునిచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం.యస్. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పాఠశాల సిబ్బంది మరియు పూర్వ విద్యార్థులు రూ. 80,000/- లు ఇవ్వడం అభినందనీయం అన్నారు. 23వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మీసాల శ్రీదేవి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి విపరకర పరిస్తితులలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండి, సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. యం.యస్.యన్. చారిటీసు కార్యనిర్వాహణాధికారి పి.వి. చలపతిరావు మాట్లాడుతూ ప్రవాశ భారతీయుడు వి.బి.వి.ఆర్. చారిటబుల్ ఫౌండేషన్ కె. సత్యనారాయణ మరియు 35 మంది ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు సహకారాన్ని అందించినందుకు ధన్యవాదములు తెలిపారు. ఇదే స్ఫూర్తితో పూర్వ విద్యార్ధులు సహకారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పేరెంట్స్ టీచర్ కమిటీ ఛైర్మన్ ప్రభాకరరావు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అమ్మకవి కొండేపూడి తాతబ్బాయి, భద్రిరాజు రవీంద్రనాథ్, పున్నం బాబ్లీ, యం.యస్.యన్. చారిటీసు పర్యావేక్షకులు పి. విజయకుమార్, ఉపాధ్యాయులు బి. సంపత్ కుమార్, సిహెచ్. శ్రీహరిరావు నాయుడు, జి. శ్రీనివాస్, పి. కాంతాభిలాష, జి. మేరి విజయకుమారి, బి. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి