పేదల ఇల్లు ;;పెండింగ్ పనులు పూర్తి చేయండి ;;;;ఫ్రూట్ కిట్ కావాలా ... కాల్ చేయండి

నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీలో భాగంగా కాకినాడ రెవిన్యూ డివిజన్ కి సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.


బుధవారం కలెక్టర్ కార్యాలయం వివేకానంద హాల్ నందు కాకినాడ రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని మండలాల ఎంపిడివో, తహశీల్దార్లతో నవరత్నాలు  ఇళ్ల స్థలాల పంపిణీపై కలెక్టర్  మురళీధర్ రెడ్డి,జాయింట్ కలెక్టర్ డా.జి.లక్ష్మీశ లు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న 1లక్ష 211 మంది లబ్ధిదారులకు  ఇళ్ల స్థలాలు పంపిణీకి సిద్ధం చేయడం జరిగిందన్నారు. లబ్ధిదారులకు వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం (జి మోడల్) రూపంలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం  జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అధికారులు ఎవరూ నిర్లక్ష్యం వహించకుండా ఇళ్ల స్థలాలు పంపిణీకి సంబంధించి మిగిలి ఉన్న భూసేకరణ ,భూమి చదును,ఫ్లాట్ ల విభజన పనులు పూర్తి చేయాలన్నారు. భూసేకరణకు సంబంధించిన బిల్లులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. భూమి చదును అవసరం లేని చోట ప్లాట్లు విభజన చేసి లాటరి నిర్వహించాలన్నారు. మండల స్థాయి అధికారులు  ఇళ్ల స్థలాల పనులపై ఉపాధి హామీ పథకం అధికారులతో సమన్వయం చేసుకుని పెండింగ్ లోఉన్న ప్రపోజల్స్ ను పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.


                    ఈ సమీక్ష సమావేశంలో డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారి ఏజి. చిన్నికృష్ణ, డ్వామ పిడి శ్యామల, హౌసింగ్ పిడి వివి.ప్రసాద్, కాకినాడ నగర కమిషనర్ కె.రమేష్, కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని మండలాల ఎంపిడిఓలు,తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.


   ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,                                           


ఫ్రూట్  కిట్ కావాలా ;;;కాల్ చేయండి 


             జిల్లాలో కరోనా వైరస్ కారణంగా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.జి.లక్ష్మీశ  బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.


           జిల్లాలోని  ప్రజలు తమకవసరమైన పండ్లు,కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత వాటిని పది నిమిషాలపాటు ఉప్పునీరు లేదా వెనిగర్ లో ఉంచి శుభ్రం చేసిన తర్వాత వినియోగించాలని జెసి తెలిపారు. ఇలా చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని తెలిపారు. కాకినాడ పట్టణ ప్రజలు రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకునేందుకు ఉద్యానశాఖ,మెప్మా ఆధ్వర్యంలో రూ.100 కే 4 రకాల పండ్ల ప్యాక్ ను ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు డోర్ డెలివరీని కూడా చేయడం జరుగుతుందని తెలిపారు. పండ్ల ప్యాక్ అవసరమైన కాకినాడ పట్టణ ప్రజలు 7901610084 నంబరుకు ఫోన్ చేసి తమ ఆర్డర్ తెలిపినట్లయితే ఇంటి వద్దకే  డెలివరీ చేయడం జరుగుతుందని జెసి తెలిపారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు