స్వైన్ ఫ్లూ కంటే కరోనా పది రెట్లు ప్రమాదకరం: WHO
కరోనా వైరస్ (కోవిడ్-19) చాలా వేగంగా విస్తరిస్తుందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అంధానోమ్ గెబ్రియేసుస్ తెలిపారు. 11 ఏళ్ల కిందట ప్రపంచాన్ని వణికించిన హెచ్1ఎన్1 వైరస్ (స్వైన్‌ఫ్లూ) కంటే కరోనా చాలా శక్తిమంతమైనదని పేర్కొన్నారు. ఇక వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్‌ను పాటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా 19 లక్షల మందికిపైగా పాజిటివ్‌గా తేలారు. మరో లక్షా 18వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ మహమ్మారి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. 2009లో ప్రపంచాన్ని కుదిపేసిన స్వైన్ ఫ్లూ కంటే ప్రస్తుత నోవెల్ కరోనా వైరస్ పది రెట్లు ప్రమాదకరమైనదని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ కనుగొనడం ఒక్కటే ఈ వ్యాధి విస్తరణకు అడ్డుకట్ట వేయగలదని అభిప్రాయపడింది.
కరోనా వైరస్ (కోవిడ్-19) చాలా వేగంగా విస్తరిస్తుందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అంధానోమ్ గెబ్రియేసుస్ తెలిపారు. 11 ఏళ్ల కిందట ప్రపంచాన్ని వణికించిన హెచ్1ఎన్1 వైరస్ (స్వైన్‌ఫ్లూ) కంటే కరోనా చాలా శక్తిమంతమైనదని పేర్కొన్నారు. ఇక వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్‌ను పాటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే వైరస్ తీవ్రత తగ్గిన క్రమంలో లాక్ డౌన్‌ను ఎత్తివేసే వేళ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని టెడ్రోస్ తెలిపారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా తిరిగి రాకపోకలు ప్రారంభమైతే, వైరస్ ముప్పు మళ్లీ తలెత్తుతుందని ఆందళన వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడమే దీనికి పరిష్కారమని పునరుద్ఘాటించారు. మరోవైపు మనదేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల 400కుపైగా చేరింది. 350కిపైగా మరణించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి