కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా ప్రతీ పేదవాడికి ప్రభుత్వ పథకాలు ;ముఖ్యమంత్రి
ప్రభుత్వం కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా ప్రతీ పేదవాడికి అనేక పధకాలు అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా కలక్టర్ లతో, ముస్లిమ్ మత పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం అమదలు చేస్తున్న వివిధ అభివృధ్ధి కార్యక్రమాల గురించి వివరించారు. జిల్లా కలక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి, జేసి లక్ష్మిశ, డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు పాల్గొన్నారు. కాకినాడకు చెందిన పెద్ద మస్జిద్ ప్రెసిడెంట్ ఇజాజుద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుత కరోనా దృష్ట్యా ముస్లిమ్ సమాజం రాబోయే రంజాన్ కాలంలో ఇండ్లలోనే నమాజ్ చేసుకుని ప్రభుత్వానికి సహకరిస్తామని ఆయన అన్నారు. ఈ విషయంలో తూర్పు గోదావరి జిల్లాలోని ముస్లిమ్ లు అందరూ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. రాజమహేంద్రవరంకు చెందిన మత పెద్ద మహమ్మద్ కరీమ్ ఖాన్ మాట్లాడుతూ రంజాన్ మాసం కాలంలో బీద వారిది దానం చేయడానికి పాస్ లు ఇప్పించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ తరువాత జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి ముస్లిమ్ మత పెద్దలతో మాట్లాడుతూ రాష్ట్ర స్ధాయిలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో ముస్లిమ్ మత పెద్దలు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి