వారి సేవలు అమూల్యమైనవి ;డిపిఓ నాగేశ్వర్ నాయక్
తూ.గో ;;విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న పారిశుధ్య సిబ్బంది, ఏఎన్ఎం,ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్ల సేవలు అమూల్యమైనవని జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర్ నాయక్ తెలిపారు. సోమవారం పెదపూడి మండలం రామేశ్వరం గ్రామ పంచాయతీ నందు గ్రామపంచాయతీ పారిశుధ్య సిబ్బందికి నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిపివో నాగేశ్వర నాయక్ మాట్లాడుతూ కరీనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలందిస్తున్న పారిశుధ్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ల్,గ్రామ వాలంటీర్ల యొక్క సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామ పారిశుధ్య సిబ్బంది కృషిని గుర్తించి గ్రామ నాయకులు నిత్యవసర సరుకులు, కూరగాయలు, ఇతర సామాగ్రిని పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా దాతలు గ్రామ మాజీ సర్పంచ్ కొటికలపూడి చినబాబు, ఆయన కుమారుడు కొటికలపూడి గణేష్ లు అందించిన బియ్యం, కూరగాయలు, వంట నూనె, సబ్బులు ,మాస్కులను పారిశుధ్య సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లకు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో పెదపూడి మండలం ఎంపీడీవో విజయ భాస్కర్, ఈవోపీఆర్డీ హరికృష్ణ సత్య రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శేఖర్ రెడ్డి ,గ్రామ సచివాలయ సిబ్బంది, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి