రంజాన్ ;;ఇళ్ల వద్దే ఉపవాసాలు .. దీక్షలు

                                                                                                      తూ .గో ;పండుగలు ఎంతో ఆహ్లాదకరంగా చేసుకుంటామని ,అలాంటి తరుణంలో కరోనా వైరస్ కారణంగా జనజీవనం స్తంభించి పోయింది అని రంజాన్ మాసాన్ని ప్రతి ముస్లిం కుటుంబాలు ఇళ్లలోనే ఉపవాసాలు దీక్షలు చేసుకోవాలని కలెక్టర్ మురళీధర్ రెడ్డి కోరారు. ఆదివారం కలెక్టర్ తన కార్యాలయం వివేకానంద హాలులో పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతా, శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ నయీమ్ అస్మి , షిమోజీ బాజ్పాయ్ ,ఓ ఎస్ డి  ఆరిఫ్ హఫీజ్  జేసి-2 జి.రాజకుమారి లతో కలిసి కాకినాడ నగరంలోని వివిధ మస్జీద్ ల మూతవల్లీలు, ఇమాంలులతో రంజాన్ మాసంలో నిర్వహించే కార్యక్రమాల పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ మాసం లో ఉపవాసం ఉండే ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంపూర్ణ సహకారం ఉంటుంది అన్నారు. ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలను పాటించాలన్నారు. ముస్లిం పెద్దలు కోరిన విధంగా సహేర్, ఇఫ్తార్ సమయాల్లో సైరెన్ మ్రోగిచటం, ఐదు పూటలా నమాజ్ వేళలు అజా ఇవ్వడంలో  ఎటువంటి నిబంధనలను ఉండవన్నారు. ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి లబ్ధిని లబ్ధిదారులకు అందేవిధంగా జిల్లా యంత్రాంగం సంపూర్ణంగా సహకరిస్తుందని కలెక్టర్ మురళీధర్రెడ్డి ముస్లిం పెద్దలకు తెలిపారు. పార్లమెంట్ సభ్యులు శ్రీమతి వంగా గీత మాట్లాడుతూ రంజాన్ మాసం విశిష్టత ఎంతో విలువైనది ఈ మాసంలో ప్రతి ముస్లింలు చేసే ప్రార్థనలతో అల్లా దయతో కరోనా వైరస్ పారద్రోలే విధముగా దువా చేయాలని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ కు మందులు లేవని వ్యక్తిగత జాగ్రత్తలు ఒక్కటే మార్గమని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. కాకినాడ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం ఎనలేని కృషి చేస్తుందని ముస్లింలు ఎక్కువగా నివసించే బ్యాంక్ పేట లో 500 మందిని కరోనా టెస్టులు చేయడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు పాటించాలని, ముస్లింలకు కావలసిన కనీస అవసరాలు తీర్చడానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. జిల్లా సూపర్డెంట్ నయీమ్ అస్మి  మాట్లాడుతూ మసీదుల్లో అజా ఇవ్వడం స్సైరెన్ మోగించడం అనుమతిస్తామని మసీదుల్లో ముగ్గురు మించి ఉండకూడదు అన్నారు. ముగ్గురు కంటే ఎక్కువమంది మసీదులో ఉంటే కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్వి తెలిపారు. కాకినాడ పెద్ద మసీదు ముత్తు వల్లి సయ్యద్ రియాజుద్దీన్ రంజాన్ లో ముస్లింలకు కావలసిన అంశాలలో సమావేశం దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా రంజాన్ మాసంలో సహర్,ఇఫ్తార్ సంబంధించిన క్యాలెండర్లను ఎంపీ వంగా గీత ,ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డి. మురళీధర్రెడ్డి ఎస్సీలు ల తో పాటు ముస్లిం పెద్దలు విడుదల చేశారు.
          ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ , వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ భాష, ముస్లిం పెద్దలు బషీరుద్దీన్, అక్బర్ అలీ, ఇమాములు గౌస్ మొహిద్దీన్ అబ్దుల్ రజాక్ తో పాటు ఇతర మసీదులు నాయకులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు