ఏపీలో కరోనా తగ్గుముఖం..ఆ మూడు జిల్లాలే డేంజర్...కొత్తగా ఏడుగురికి పాజిటివ్

 

ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారం ఏడు కొత్త కేసులు నమోదు కాగా రెండు జిల్లాల్లోనే ఈ కేసులు నమోదయ్యాయి.              ఏపీలోకరోనాకేసుల సంఖ్యగా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా ఏడు కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 3 కేసులు నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 439కి పెరిగింది. కోవిడ్ కారణంగా రాష్ట్రంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 12 మంది చికిత్స అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.రాష్ట్రంలో అత్యధికంగా కోవిడ్ కేసులు గుంటూరు జిల్లాలో నమోదు అవుతున్నాయి. ఇక్కడ 93 కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 84 కేసులు నమోదయ్యాయి. 56 కేసులతో నెల్లూరు తర్వాతి స్థానంలో ఉంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే ఇప్పటి వరకూ కరోనా కేసులు నమోదు కాలేదు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు