దాతల సహాయం మరింత బాధ్యతను పెంచుతుంది ;ఎస్పీ నయిం అస్మి

కోవిడ్  -19 నివారణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి కావలసిన ఆర్థిక వనరులు నిమిత్తం తమ వంతు చేయూతగా సొసైటీ ఆఫ్ చర్చ్ అఫ్ గాడ్ ఇన్ ఇండియా సంస్థ వారు 50 వేల రూపాయలు, అదేవిధంగా జ్యోతిస్  హోప్ ఫౌండేషన్ కు చెందిన బిషప్:  జ్యోతి కుమార్ రెడ్డి 50 వేల రూపాయల చెక్కులను కాకినాడ పట్టణ ఎమ్మెల్యే  ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి  సమక్షంలో యస్.పి  అద్నాన్ నయిం అస్మికు  అందజేసారు.                                                ఈ రకంగా పోలీసు శాఖ పట్ల అభిమానంతో చేసిన సాయం మా బాధ్యతను ఇంకా పెంచుతుందని ఎంత కష్టమైనా విధి నిర్వహణలో తూర్పు గోదావరి జిల్లా పోలీస్ అంతా ఐక్యతతో, నిబద్ధతతో విధులు నిర్వహిస్తామని తెలియపరుస్తూ వారికి ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు. అదే విధంగా రాజమండ్రికి చెందిన "వేద లైఫ్ సైన్సెస్" సంస్థ వారు ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా పోలీసు కార్యాలయం కాకినాడలో పనిచేస్తున్న అన్ని విభాగాలకు చెందిన అధికారులు మరియు సిబ్బందికి శానిటైజర్, గ్లూకోజ్ ఎనర్జీ డ్రింక్ ,వాటర్ బాటిల్ ,పూట్స్ తో కూడిన 300 కిట్లను యస్.పి  అద్నాన్ నయిం అస్మి  చేతుల మీదుగా అంద చేసారు. ఈ రకమైన అత్యవసర పరిస్థితిలో సమాజసేవ నిమిత్తం ముందుకు వచ్చిన ఈ వేద సంస్థ వారిని యస్.పి  అభినందిస్తూ వారికి కృతజతలు తెలియచేశారు. ఈ కార్యక్రమాలలో అడిషనల్ ఎస్పీ( అడ్మిన్)  కె. కుమార్, ఎస్.బి డి.ఎస్.పిలు  ఎం.అంబికా ప్రసాద్  ,ఎస్ మురళీ మోహన్, ట్రాఫిక్ డిఎస్పీ బి.రామకృష్ణ  , ఎస్.బి సి.ఐ.  ఎస్.రాంబాబు, ట్రాఫిక్ సి.ఐ. పి.మురళీకృష్ణారెడ్డి  తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు