మెడిసిన్ కొన్నవారిపై నిఘా
ఏపీలో కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది జగన్ సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా ర్యాండమ్ టెస్టింగ్ డోస్ పెంచింది.. అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తోంది. అలాగే టెలీ మెడిసిన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం మందుల షాపులపై ఫోకస్ పెట్టింది. దగ్గు, జలుబు మందులు కొనుగోలుచేసేవారి వివరాలు ఆరా తీస్తోంది.. దీనికి సంబంధించి చర్యలు ప్రారంభించారు అధికారులు.
అందుకే రాష్ట్రవ్యాప్తంగా మందుల షాపుల వారు జ్వరం, జలుబు, దగ్గ మాత్రల కోసం వచ్చిన వారి పేరు, మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేసేలా ఓ యావ్‌ను రూపొందిస్తున్నారు. ఈ యాప్‌కు వచ్చిన వివరాలను కొవిడ్-19 కేంద్రానికి ఎప్పటికప్పుడు పంపిస్తారు. వీటి ఆధారంగా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు సంబంధిత వ్యక్తుల వివరాలపై ఆరా తీయనున్నారు. మందులు ఉపయోగించేవారు చెప్పే లక్షణాలు, ఇతర వివరాలతో ఏం చేయాలన్నది నిర్ణయిస్తారు. ఒకవేళ ఎవరికైనా లక్షణాల ఉంటే పరీక్షలు నిర్వహించి.. క్వారంటైన్‌కు తరలించనున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి