పొదుపు మొత్తం నుండి డ్వాక్రా సంఘాల  సభ్యులకు సాయం

                                                                                                                   పొదుపు మొత్తం నుండి డ్వాక్రా సంఘాల  సభ్యులకు సాయం
_ 25 కేజీల బియ్యం, ఐదు లీటర్ల ఆయిల్, రూ1500 నగదు
_ నగర పాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులు కప్పల వెలుగు కుమారి ఫలితం
రాజమండ్రి: సేవా కార్యక్రమాలే కలకాలం నిలుస్తాయి మనం చేసే సేవా కార్యక్రమాలే కలకాలం నిలిచి ఉంటాయని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు హితవు పలికారు. స్థానిక 13వ డివిజన్లో శనివారం నిత్యావసరాల పంపిణీ జరిగింది. మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగు కుమారి,  బొర్రా చిన్ని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరై 120 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, 5 కేజీల ఫ్రీడమ్ ఆయిల్తో పాటు ఒక్కో కుటుంబానికి 1500 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. స్వీయ నిర్బంధంతో పాటు నిత్యం చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుంటూ ఉండాలని సూచించారు. వైద్యుల సలహాలు పాటించి కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూరంపూడి శ్రీహరి, సిహెచ్ మేరీ, దుర్గ, బి కుమారి, బొంత ఐశ్వర్య, సిహెచ్ క్రాంతి, రామాయమ్మ, సాగర్, బి పద్మ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు